Selim gaavu marum dimta seyamjochchenu

చెలిఁ గావు మరుఁ డింత సేయఁజొచ్చెను
Language

(॥పల్లవి॥)
చెలిఁ గావు మరుఁ డింత సేయఁజొచ్చెను
సెలవుల నవ్వులే సిగ్గు రేఁచఁ జొచ్చెను

(॥చెలి॥)
చెక్కుపైఁ జేయిడుకొని చింతించఁగాఁ జెలియకు
వుక్కుమీరి పెంజెమట లూరఁ జొచ్చెను
వెక్కసపు విరహాన వెరగుతో నుండఁగాను
మిక్కిలి నిట్టూరుపులు మించఁజొచ్చెను

(॥చెలి॥)
యెదురుచూచి నీరాక కేఁకరుచునుండఁగాను
పొదలుచుఁ దమక ముప్పొంగఁజొచ్చెను
అదన నీపొందులకు నలయుచునుండఁగాను
తుదలేని కోరికలు తొడరఁగఁజొచ్చెను

(॥చెలి॥)
తగిలి నీవలపులదప్పులఁ బొరలఁగాను
దగదొట్టి సందు లదరఁజొచ్చెను
జిగి నలమేల్ మంగ శ్రీవేంకటేశుఁడ నిన్ను
మిగులఁ గూడఁగా మేలు మెరయఁగఁజొచ్చెను

(||pallavi||)
sĕlim̐ gāvu marum̐ ḍiṁta seyam̐jŏchchĕnu
sĕlavula navvule siggu rem̐sam̐ jŏchchĕnu

(||sĕli||)
sĕkkubaim̐ jeyiḍugŏni siṁtiṁcham̐gām̐ jĕliyagu
vukkumīri pĕṁjĕmaḍa lūram̐ jŏchchĕnu
vĕkkasabu virahāna vĕragudo nuṁḍam̐gānu
mikkili niṭṭūrubulu miṁcham̐jŏchchĕnu

(||sĕli||)
yĕdurusūsi nīrāga kem̐karusunuṁḍam̐gānu
pŏdalusum̐ damaga muppŏṁgam̐jŏchchĕnu
adana nībŏṁdulagu nalayusunuṁḍam̐gānu
tudaleni korigalu tŏḍaram̐gam̐jŏchchĕnu

(||sĕli||)
tagili nīvalabuladappulam̐ bŏralam̐gānu
dagadŏṭṭi saṁdu ladaram̐jŏchchĕnu
jigi nalamel maṁga śhrīveṁkaḍeśhum̐ḍa ninnu
migulam̐ gūḍam̐gā melu mĕrayam̐gam̐jŏchchĕnu