Seligattevu neevemi sesinaa dosamu gaadu

చెలికత్తెవు నీవేమి సేసినా దోసము గాదు
Language

(॥పల్లవి॥)
చెలికత్తెవు నీవేమి సేసినా దోసము గాదు
తొలుసారే యింతేసి పొందులు నేనెఱఁగను

(॥చెలి॥)
వూరకే తాఁ గతచెప్పీ నూఁకొనవే నామారు
చేరి యెం(యం?)త దంటగాను చిన్నదానను
తేరకొన నన్నుఁజూచి దిగ్గన మోము చూపవే
నేర నంతేసి తనతో నెరవాదితనము

(॥చెలి॥)
వొడివట్టి తీసీ నామా రొద్దఁ గూచుఁడఁగదవే
చిడుముడి నందుకైతే సిగ్గయ్యా నాకు
విడెమిచ్చీ నందుకొని వేగమె నాకొసఁగవే
గుడిగొన్న కొత్త పెండ్లికూఁతురను నేను

(॥చెలి॥)
నలువున గిలిగించీ నామారు నీవు నవ్వవే
ఇలువెళ్లకబోగించేఇల్లాల నేను
అలమేలుమంగపతియగు శ్రీవేంకటేశుఁడు
కలసె నన్నిట్టె మెచ్చఁగదవే నేఁ గోలను

(||pallavi||)
sĕligattĕvu nīvemi sesinā dosamu gādu
tŏlusāre yiṁtesi pŏṁdulu nenĕṟam̐ganu

(||sĕli||)
vūrage tām̐ gadasĕppī nūm̐kŏnave nāmāru
seri yĕṁ(yaṁ?)ta daṁṭagānu sinnadānanu
teragŏna nannum̐jūsi diggana momu sūbave
nera naṁtesi tanado nĕravādidanamu

(||sĕli||)
vŏḍivaṭṭi tīsī nāmā rŏddam̐ gūsum̐ḍam̐gadave
siḍumuḍi naṁdugaide siggayyā nāgu
viḍĕmichchī naṁdugŏni vegamĕ nāgŏsam̐gave
guḍigŏnna kŏtta pĕṁḍligūm̐turanu nenu

(||sĕli||)
naluvuna giligiṁchī nāmāru nīvu navvave
iluvĕḽlagabogiṁcheillāla nenu
alamelumaṁgabadiyagu śhrīveṁkaḍeśhum̐ḍu
kalasĕ nanniṭṭĕ mĕchcham̐gadave nem̐ golanu