Seligattem ganaga nem ja(je?)ppagabodu

చెలికత్తెఁ గనక నేఁ జ(జె?)ప్పకపోదు
Language

(॥పల్లవి॥)
చెలికత్తెఁ గనక నేఁ జ(జె?)ప్పకపోదు
కలవంటిది వలపు కడమలు సేతురా

(॥చెలి॥)
వువిళ్లూరఁ బిలిపించి వూరకే నీ వుండఁగాను
నివ్వెరగుతోడ నాపె నిలుచున్నది
యెవ్వరు మాటలాడించే రిద్దరు సిగ్గువడేరు
పువ్వువంటి(ది) జవ్వనము పొద్దు గడపుదురా

(॥చెలి॥)
పనివ డింటికి వచ్చి పరాకు సేసుకుండఁగ
కనుదాఁకా మంచముసంగడి నున్నది
యెనయఁగ మిమ్మిద్దరి నెచ్చరించేవా రెవ్వరు
గనివంటిది వేడుక కట్టిపెట్టవలెనా

(॥చెలి॥)
చేయి కాఁగిటికిఁ జాఁచి చిరునవ్వుతో నుండఁగా
ఆయములు నిన్నంటుచు నాకె వున్నది
యీయెడ శ్రీవేంకటేశ యిద్దరి మెచ్చ నెవ్వరు
చాయవంటిది రతి రచ్చల వేయవలెనా

(||pallavi||)
sĕligattĕm̐ ganaga nem̐ ja(jĕ?)ppagabodu
kalavaṁṭidi valabu kaḍamalu sedurā

(||sĕli||)
vuviḽlūram̐ bilibiṁchi vūrage nī vuṁḍam̐gānu
nivvĕragudoḍa nābĕ nilusunnadi
yĕvvaru māḍalāḍiṁche riddaru sigguvaḍeru
puvvuvaṁṭi(di) javvanamu pŏddu gaḍabudurā

(||sĕli||)
paniva ḍiṁṭigi vachchi parāgu sesuguṁḍam̐ga
kanudām̐kā maṁchamusaṁgaḍi nunnadi
yĕnayam̐ga mimmiddari nĕchchariṁchevā rĕvvaru
ganivaṁṭidi veḍuga kaṭṭibĕṭṭavalĕnā

(||sĕli||)
seyi kām̐giḍigim̐ jām̐si sirunavvudo nuṁḍam̐gā
āyamulu ninnaṁṭusu nāgĕ vunnadi
yīyĕḍa śhrīveṁkaḍeśha yiddari mĕchcha nĕvvaru
sāyavaṁṭidi radi rachchala veyavalĕnā