చెలికత్తెలునుఁ దాను చేర వచ్చె నీకడకు
(॥పల్లవి॥)
చెలికత్తెలునుఁ దాను చేర వచ్చె నీకడకు
పిలిపించితివో తానే ప్రియమున వచ్చెనో
(॥॥)
కనకపు మెట్టే లు కణుంగని వాఁగఁ గాను
వనితె నీకెదురుగా వచ్చీ నెవ్వతో
మినుకుల పట్టుచీర మేలుముసుఁగు వెట్టు క
కనుచూపు దవ్వులనే కానవచ్చీ నదివో
(॥॥)
ముత్తేల కంకణాలు మొరమొర వాఁగఁగాను
యెత్తి చేతులను మొక్కీ నెవ్వతో నీకు
కొత్త జవ్వాది వాసన కొలువులో నెల్లా నిండ
హత్తి నీయండకు వచ్చీ నల్లంత నదివో
(॥॥)
కట్టిన గింట్టేపుఁ జీర గళబెళ మనఁగాను
యిట్టే వచ్చి కానుక నీ కిచ్చీ నెవ్వతో
గుట్టున శ్రీ వేంకటేశ కూడితి వీకెను నాకుఁ
జుట్టమై నీ రతిఁ గూర్చి చొక్కఁ జేసీ నిదివో
(||pallavi||)
sĕligattĕlunum̐ dānu sera vachchĕ nīgaḍagu
pilibiṁchidivo tāne priyamuna vachchĕno
(||||)
kanagabu mĕṭṭe lu kaṇuṁgani vām̐gam̐ gānu
vanidĕ nīgĕdurugā vachchī nĕvvado
minugula paṭṭusīra melumusum̐gu vĕṭṭu ka
kanusūbu davvulane kānavachchī nadivo
(||||)
muttela kaṁkaṇālu mŏramŏra vām̐gam̐gānu
yĕtti sedulanu mŏkkī nĕvvado nīgu
kŏtta javvādi vāsana kŏluvulo nĕllā niṁḍa
hatti nīyaṁḍagu vachchī nallaṁta nadivo
(||||)
kaṭṭina giṁṭṭebum̐ jīra gaḽabĕḽa manam̐gānu
yiṭṭe vachchi kānuga nī kichchī nĕvvado
guṭṭuna śhrī veṁkaḍeśha kūḍidi vīgĕnu nāgum̐
juṭṭamai nī radim̐ gūrsi sŏkkam̐ jesī nidivo