Seligattelamu nenu senagavachchevu mammu

చెలికత్తెలము నేను చెనకవచ్చేవు మమ్ము
Language

(॥పల్లవి॥)
చెలికత్తెలము నేను చెనకవచ్చేవు మమ్ము
చెలిమి చెట్టడిచితే చేటఁడవునయ్యా

(॥॥)
కోరి నిన్నుఁబిలువఁగ కొమ్మ వంపఁగా వచ్చితి
వూరకే సుద్దులడిగే వొట్టుక నన్ను
మారుకు మాటాడఁబోతే మాటలెంనైనాఁ గలవు
గోర గీరితే నేరు కొచ్చి పారునయ్యా

(॥॥)
గందము నాచే నంపఁగా కానుక దెచ్చితి నీకు
అంది నాతో నవ్వవచ్చే వప్పుడే నీవు
చిందిచింది యెత్తఁబోతే చేరి మాపుదాఁకాఁబట్టు
చెందితేఁ జిగురుఁగొమ్మ చేఁగలవునయ్యా

(॥॥)
తనమారు నన్నంపఁగా దండమువెట్టితి నీకు
యెనసి కాఁగిటఁగుచ్చియెత్తే వేమయ్యా
వెనక నాపె రాఁగా శ్రీవేంకటేశ కూడితివి
ననిచి పై కొంటేను నవ్వు నిజమవునయ్యా

(||pallavi||)
sĕligattĕlamu nenu sĕnagavachchevu mammu
sĕlimi sĕṭṭaḍiside seḍam̐ḍavunayyā

(||||)
kori ninnum̐biluvam̐ga kŏmma vaṁpam̐gā vachchidi
vūrage suddulaḍige vŏṭṭuga nannu
mārugu māḍāḍam̐bode māḍalĕṁnainām̐ galavu
gora gīride neru kŏchchi pārunayyā

(||||)
gaṁdamu nāse naṁpam̐gā kānuga dĕchchidi nīgu
aṁdi nādo navvavachche vappuḍe nīvu
siṁdisiṁdi yĕttam̐bode seri mābudām̐kām̐baṭṭu
sĕṁdidem̐ jigurum̐gŏmma sem̐galavunayyā

(||||)
tanamāru nannaṁpam̐gā daṁḍamuvĕṭṭidi nīgu
yĕnasi kām̐giḍam̐guchchiyĕtte vemayyā
vĕnaga nābĕ rām̐gā śhrīveṁkaḍeśha kūḍidivi
nanisi pai kŏṁṭenu navvu nijamavunayyā