చెలికత్తెలము నేము సేసేదేమి
(॥పల్లవి॥)
చెలికత్తెలము నేము సేసేదేమి
అలసితి వాకె మోవి అందుకొనవయ్యా
(॥॥)
కూరిమి గొసరి పూవుగుత్తిఁ గొని ఆకె వేసె
అరయ నీకవి మరనమ్ములై తాఁకె
ఆరితేరెఁ బనులెల్ల నందుకేమి సేయవచ్చు
మారుకొని వలపుల మందు వుయ్యవయ్యా
(॥॥)
బత్తితోడ నీపై నాపె పక్కనఁ బన్నీరు చల్లె
వొత్తిన విరహన నీకుడుకెత్తెను
చిత్తగించి తగవులు చెప్పేదిందులో నేమి
మత్తిలి వచ్చి మాటల మంత్రించుకోవయ్యా
(॥॥)
కొమ్మ నిన్ను రతిఁ గూడి కుచముల నిన్ను నొత్తె
కమ్మి నీకు రాతికంటె గట్లాయను
యిమ్ముల శ్రీవేంకటేశ యెవ్వరూ నేమి చెప్పేరు
తమ్మికొనగోరి యంత్రము వ్రాసుకోవయ్య
(||pallavi||)
sĕligattĕlamu nemu sesedemi
alasidi vāgĕ movi aṁdugŏnavayyā
(||||)
kūrimi gŏsari pūvuguttim̐ gŏni āgĕ vesĕ
araya nīgavi maranammulai tām̐kĕ
āriderĕm̐ banulĕlla naṁdugemi seyavachchu
mārugŏni valabula maṁdu vuyyavayyā
(||||)
battidoḍa nībai nābĕ pakkanam̐ bannīru sallĕ
vŏttina virahana nīguḍugĕttĕnu
sittagiṁchi tagavulu sĕppediṁdulo nemi
mattili vachchi māḍala maṁtriṁchugovayyā
(||||)
kŏmma ninnu radim̐ gūḍi kusamula ninnu nŏttĕ
kammi nīgu rādigaṁṭĕ gaṭlāyanu
yimmula śhrīveṁkaḍeśha yĕvvarū nemi sĕpperu
tammigŏnagori yaṁtramu vrāsugovayya