Seligattelamu nemu seppamgalavaaramimte

చెలికత్తెలము నేము చెప్పఁగలవారమింతె
Language

(॥పల్లవి॥)
చెలికత్తెలము నేము చెప్పఁగలవారమింతె
యెలమి నిన్నియును నీవియ్యకొనవయ్యా

(॥చెలి॥)
నీతోడిమాటలకు నెలఁత వేడుకపడి
బాఁతిపడి వున్నదిట్టె పలుకవయ్యా
యేతరితనమునను యేల పరాకై వుండేవు
నాతో నవ్వినయట్టె నవ్వవయ్యా

(॥చెలి॥)
మొగము చూచేనంటా ముదిత గాచుకున్నది
యెగసక్కేలేల తల యెత్తవయ్యా
నిగిడి రాజసమున నిట్లే చూపేవు
వొగి నన్నొరసినట్టే వొరయవయ్యా

(॥చెలి॥)
అలమేల్మంగ నీ వురమందె నెలకొన్నది
కలసితివి ప్రియము గైకొనవయ్యా
వెలయ శ్రీ వేంకటేశ వింతగాఁ దమకించేవు
యిల నన్నునేలినట్టే యేలవయ్యా

(||pallavi||)
sĕligattĕlamu nemu sĕppam̐galavāramiṁtĕ
yĕlami ninniyunu nīviyyagŏnavayyā

(||sĕli||)
nīdoḍimāḍalagu nĕlam̐ta veḍugabaḍi
bām̐tibaḍi vunnadiṭṭĕ palugavayyā
yedaridanamunanu yela parāgai vuṁḍevu
nādo navvinayaṭṭĕ navvavayyā

(||sĕli||)
mŏgamu sūsenaṁṭā mudida gāsugunnadi
yĕgasakkelela tala yĕttavayyā
nigiḍi rājasamuna niṭle sūbevu
vŏgi nannŏrasinaṭṭe vŏrayavayyā

(||sĕli||)
alamelmaṁga nī vuramaṁdĕ nĕlagŏnnadi
kalasidivi priyamu gaigŏnavayyā
vĕlaya śhrī veṁkaḍeśha viṁtagām̐ damagiṁchevu
yila nannunelinaṭṭe yelavayyā