చెలికత్తెలము నేము చెప్పక పోదు
(॥పల్లవి॥)
చెలికత్తెలము నేము చెప్పక పోదు
యెలమి నీ యేతులకు యెడమెంత లేదు
(॥చెలి॥)
మగువ నీతోనిపుడు మంచిమాట లాడరాదా
యెగసక్కేలకుఁ బొద్దు యెంత లేదు
మొగము చూచి యాపెమొక్కులు చేకొనరాదా
మగతనపుబీరము మరి యెంత లేదు
(॥చెలి॥)
చెలియ సేసేటి యట్టి సేవ లియ్యకొనరాదా
యెలయింపు నవ్వులకు యెంత లేదు
కలసి యాపెనిందుకు కాఁగిలించుకొనరాదా
అలమి నీలోనిగుట్టు అది యెంతలేదు
(॥చెలి॥)
చనవిచ్చి యాపెతో సరసమాడఁగరాదా
యెనసిన నివ్వెరగు యెంతలేదు
పనివడి యాపెఁ దొడపై నిడుకొనరాదా
అనుఁగు శ్రీ వేంకటేశ ఆలపెంతలేదు
(||pallavi||)
sĕligattĕlamu nemu sĕppaga podu
yĕlami nī yedulagu yĕḍamĕṁta ledu
(||sĕli||)
maguva nīdonibuḍu maṁchimāḍa lāḍarādā
yĕgasakkelagum̐ bŏddu yĕṁta ledu
mŏgamu sūsi yābĕmŏkkulu segŏnarādā
magadanabubīramu mari yĕṁta ledu
(||sĕli||)
sĕliya seseḍi yaṭṭi seva liyyagŏnarādā
yĕlayiṁpu navvulagu yĕṁta ledu
kalasi yābĕniṁdugu kām̐giliṁchugŏnarādā
alami nīloniguṭṭu adi yĕṁtaledu
(||sĕli||)
sanavichchi yābĕdo sarasamāḍam̐garādā
yĕnasina nivvĕragu yĕṁtaledu
panivaḍi yābĕm̐ dŏḍabai niḍugŏnarādā
anum̐gu śhrī veṁkaḍeśha ālabĕṁtaledu