Seligattelamu nemu seligi neevu padivi

చెలికత్తెలము నేము చెలికి నీవు పతివి
Language

(॥పల్లవి॥)
చెలికత్తెలము నేము చెలికి నీవు పతివి
యెలయింపు లేమిటికి నింటికి రావయ్యా

(॥చెలి॥)
యేమని విన్నవింతుము యెందాఁకా గోలతనము
కామిని నీ రాకకుఁ గాచుకున్నది
చేముట్టి పిలువరాదు సిగ్గువడితేఁ బోదు
కాముఁ డెడ నున్నవాఁడు గతియేది మాకు

(॥చెలి॥)
వచ్చినపని యేఁటిది వైపులెటువలె వచ్చు
పచ్చిదేర నాపె యాసపడి వున్నది
రచ్చ కెక్కెను వలపు రవ్వ నినుఁ జేయరాదు
ముచ్చ టేమిటను బాసు ముందర యేలాగు

(॥చెలి॥)
తలఁపించ నిఁకనేల తమకము నీసొమ్ము
అలమేల్‌మంగ నీవురమందె వున్నది
కలసితివి కాఁగిట ఘనుఁడ శ్రీవేంకటేశ
ఫలియించె మాతపము పంతమేమి చెప్పేము

(||pallavi||)
sĕligattĕlamu nemu sĕligi nīvu padivi
yĕlayiṁpu lemiḍigi niṁṭigi rāvayyā

(||sĕli||)
yemani vinnaviṁtumu yĕṁdām̐kā goladanamu
kāmini nī rāgagum̐ gāsugunnadi
semuṭṭi piluvarādu sigguvaḍidem̐ bodu
kāmum̐ ḍĕḍa nunnavām̐ḍu gadiyedi māgu

(||sĕli||)
vachchinabani yem̐ṭidi vaibulĕḍuvalĕ vachchu
pachchidera nābĕ yāsabaḍi vunnadi
rachcha kĕkkĕnu valabu ravva ninum̐ jeyarādu
muchcha ṭemiḍanu bāsu muṁdara yelāgu

(||sĕli||)
talam̐piṁcha nim̐kanela tamagamu nīsŏmmu
alamel‌maṁga nīvuramaṁdĕ vunnadi
kalasidivi kām̐giḍa ghanum̐ḍa śhrīveṁkaḍeśha
phaliyiṁchĕ mādabamu paṁtamemi sĕppemu