Seligattelado nemi seppevu saare saare

చెలికత్తెలతో నేమి చెప్పేవు సారె సారె
Language

(॥పల్లవి॥)
చెలికత్తెలతో నేమి చెప్పేవు సారె సారె
వలచినదాని నేల వట్టి నేరా లెంచేవు

(॥చెలి॥)
సిగ్గువడి వుండెఁగాక చేరి నీతొ గోపగించి
యెగ్గుపట్టి వన్నదా యింతి యేమైనా
వొగ్గి వేడుకొనె గాక వూరకే చెక్కు చేనూఁది
వెగ్గళించి చేత చేసి విఱ్ఱవీగేనా

(॥చెలి॥)
అలయిక నుండెఁగాక అట్టె నీతొ మాటాడక
చలము సాదించెనా సతి యేమైనా
అలరి నీ నొసఁగిన హరాలు చూపెఁ గాక
పలుమారు రొమ్ము దట్టి పంతమాడేనా

(॥చెలి॥)
తతితో నుపరిరతమున మెప్పించెఁగాక
రతి నిన్ను నోడించెనా రామ యేమైనా
సతమై శ్రీవేంకటేశ జవ్వని నేలితి విట్లు
కత నీచే వినె గాక గర్వము నెరపెనా

(||pallavi||)
sĕligattĕlado nemi sĕppevu sārĕ sārĕ
valasinadāni nela vaṭṭi nerā lĕṁchevu

(||sĕli||)
sigguvaḍi vuṁḍĕm̐gāga seri nīdŏ gobagiṁchi
yĕggubaṭṭi vannadā yiṁti yemainā
vŏggi veḍugŏnĕ gāga vūrage sĕkku senūm̐di
vĕggaḽiṁchi seda sesi viṭravīgenā

(||sĕli||)
alayiga nuṁḍĕm̐gāga aṭṭĕ nīdŏ māḍāḍaga
salamu sādiṁchĕnā sadi yemainā
alari nī nŏsam̐gina harālu sūbĕm̐ gāga
palumāru rŏmmu daṭṭi paṁtamāḍenā

(||sĕli||)
tadido nubariradamuna mĕppiṁchĕm̐gāga
radi ninnu noḍiṁchĕnā rāma yemainā
sadamai śhrīveṁkaḍeśha javvani nelidi viṭlu
kada nīse vinĕ gāga garvamu nĕrabĕnā