Seligattelado nela seri sarasamaadevu

చెలికత్తెలతో నేల చేరి సరసమాడేవు
Language

(॥పల్లవి॥)
చెలికత్తెలతో నేల చేరి సరసమాడేవు
వలపించితినా నీ వద్ద నుంటిఁ గాక

(॥॥)
పలుకుఁదేనెల నిన్ను భ్రమయించ వచ్చితినా
చెలియమాటలు నీకుఁ జెప్పితిఁ గాక
కలికితనాల నీకుఁ గడుగుట్టు సేసితినా
వెలి నిన్నుఁ జూచి చూచి వెరగందితిఁ గాక

(॥॥)
అక్కరతో నీకు నడియాసలు చూపితినా
యిక్కున లంటఁగాఁ గాను కిచ్చితిఁ గాక
మక్కువ సేయుమనుచు మర్మము లంటితినా
చేతులు నోక్కఁగఁ జేత మొక్కితిఁ గాక

(॥॥)
యొనయుమనుచు నీతో నెరుక సేసితినా
వోనర నే నీపాదా లొత్తితిఁ గాక
ఘనుఁడ శ్రీ వేంకటేశ కాఁగిట నన్నేలితివి
మనసు సోదించితినా మరిగితిఁ గాక

(||pallavi||)
sĕligattĕlado nela seri sarasamāḍevu
valabiṁchidinā nī vadda nuṁṭim̐ gāga

(||||)
palugum̐denĕla ninnu bhramayiṁcha vachchidinā
sĕliyamāḍalu nīgum̐ jĕppidim̐ gāga
kaligidanāla nīgum̐ gaḍuguṭṭu sesidinā
vĕli ninnum̐ jūsi sūsi vĕragaṁdidim̐ gāga

(||||)
akkarado nīgu naḍiyāsalu sūbidinā
yikkuna laṁṭam̐gām̐ gānu kichchidim̐ gāga
makkuva seyumanusu marmamu laṁṭidinā
sedulu nokkam̐gam̐ jeda mŏkkidim̐ gāga

(||||)
yŏnayumanusu nīdo nĕruga sesidinā
vonara ne nībādā lŏttidim̐ gāga
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kām̐giḍa nannelidivi
manasu sodiṁchidinā marigidim̐ gāga