చెలికత్తె మారు సేవసేసితే దోసము గాదు
(॥పల్లవి॥)
చెలికత్తె మారు సేవసేసితే దోసము గాదు
పొలసి నీవే యాకెకు పూనుక వచ్చితివి
(॥చెలి॥)
చెప్పవే యీకె సుద్దులు చెలువుఁడు వినీఁగాని
చప్పఁగాకుండాను వో సకియా
అప్పటిఁ దమి రేఁచనే ఆ చుట్టపు వరుసనే
తప్పుగాదు నీవూ ముందే తగులైనదానవు
(॥చెలి॥)
చూపనే యాకె కానికె సూటి నందుకొనీఁగాని
నీపొందు మరువకుండా నేరుపుతోను
యీపొద్దే వచ్చినపని యీడేరించుకోవే మొక్కి
వోపుడు వెంతటికైనా వలపైనదానవు
(॥చెలి॥)
ఇయ్యవే యాకె లేకలు ఇట్టె చదివీఁగాని
ఇయ్యెడ నీ వుపకార మెన్నికకెక్క
నెయ్యమున నన్ను నేలె నేఁడే శ్రీవేంకటేశుఁడు
చయ్యన నీవూఁ గూడవే సంగాతపుదానవు
(||pallavi||)
sĕligattĕ māru sevaseside dosamu gādu
pŏlasi nīve yāgĕgu pūnuga vachchidivi
(||sĕli||)
sĕppave yīgĕ suddulu sĕluvum̐ḍu vinīm̐gāni
sappam̐gāguṁḍānu vo sagiyā
appaḍim̐ dami rem̐sane ā suṭṭabu varusane
tappugādu nīvū muṁde tagulainadānavu
(||sĕli||)
sūbane yāgĕ kānigĕ sūḍi naṁdugŏnīm̐gāni
nībŏṁdu maruvaguṁḍā nerubudonu
yībŏdde vachchinabani yīḍeriṁchugove mŏkki
vobuḍu vĕṁtaḍigainā valabainadānavu
(||sĕli||)
iyyave yāgĕ legalu iṭṭĕ sadivīm̐gāni
iyyĕḍa nī vubagāra mĕnnigagĕkka
nĕyyamuna nannu nelĕ nem̐ḍe śhrīveṁkaḍeśhum̐ḍu
sayyana nīvūm̐ gūḍave saṁgādabudānavu