Selidaa madi neeseṟagaaga

చెలిదా మతి నీచెఱగాక
Language

(॥పల్లవి॥)
చెలిదా మతి నీచెఱగాక
తలఁపగ నీకిది తగులైపోయె

(॥చెలిదా॥)
తరుణీమణివా తమ్మికన్ను లివి
అరయ నెపుడు నీయవె కాక
నిరతపుఁజూపులు నీచెలువమునకే
యిరవై వనితకు నెరవైపోయె

(॥చెలిదా॥)
మెలుఁతది గా దీమే నిటుకాఁకల
కలవఱచిన నీయదే కాక
పులకజొంపములఁ బ్రుంగు డగుచు నీ
యలుకల చెమటల కమ్ముడొవోయె

(॥చెలిదా॥)
పంకజముఖివా బలుపుఁ గుచములు న
ఖాంకరుచుల నీయవే కాక
వేంకటేశ నీ వేడుక కౌఁగిట
నంకురించె నీవవునోకావో

(||pallavi||)
sĕlidā madi nīsĕṟagāga
talam̐paga nīgidi tagulaiboyĕ

(||sĕlidā||)
taruṇīmaṇivā tammigannu livi
araya nĕbuḍu nīyavĕ kāga
niradabum̐jūbulu nīsĕluvamunage
yiravai vanidagu nĕravaiboyĕ

(||sĕlidā||)
mĕlum̐tadi gā dīme niḍugām̐kala
kalavaṟasina nīyade kāga
pulagajŏṁpamulam̐ bruṁgu ḍagusu nī
yalugala sĕmaḍala kammuḍŏvoyĕ

(||sĕlidā||)
paṁkajamukhivā balubum̐ gusamulu na
khāṁkarusula nīyave kāga
veṁkaḍeśha nī veḍuga kaum̐giḍa
naṁkuriṁchĕ nīvavunogāvo