చెలి యింత సేసెనంటా చిమిడేవు విరహాన
(॥పల్లవి॥)
చెలి యింత సేసెనంటా చిమిడేవు విరహాన
తలఁపుల కాఁకలలో తగుల నేది
(॥చెలి॥)
చక్కెరమోవిమీఁదిసరసపుమాటలలో
యెక్కువతక్కువమాట లెంచ నేవి
గుక్కక కలువరేకులవంటి చూపులలో
పిక్కటిల్లి గుండెదాఁకి బెదర నేది
(॥చెలి॥)
జలజపు మొగడలచన్నుల వొత్తులలోన
నులివచ్చిగా నాఁటి నొవ్వఁగ నేది
చెలరేఁగి చిగురుల చేగోరి చెనకులలో
నలువంక మర్మములు నాఁటఁగ నేవి
(॥చెలి॥)
బత్తితో నీకాఁగిటిపరవశములలోన
తత్తరపుగయ్యాళితనము లేవి
యిత్తల శ్రీవేంకటేశ యింతి నన్ను నెనసెను
మత్తిలి విరహ మిఁక మలసినా నేది
(||pallavi||)
sĕli yiṁta sesĕnaṁṭā simiḍevu virahāna
talam̐pula kām̐kalalo tagula nedi
(||sĕli||)
sakkĕramovimīm̐disarasabumāḍalalo
yĕkkuvadakkuvamāḍa lĕṁcha nevi
gukkaga kaluvaregulavaṁṭi sūbulalo
pikkaḍilli guṁḍĕdām̐ki bĕdara nedi
(||sĕli||)
jalajabu mŏgaḍalasannula vŏttulalona
nulivachchigā nām̐ṭi nŏvvam̐ga nedi
sĕlarem̐gi sigurula segori sĕnagulalo
naluvaṁka marmamulu nām̐ṭam̐ga nevi
(||sĕli||)
battido nīgām̐giḍibaravaśhamulalona
tattarabugayyāḽidanamu levi
yittala śhrīveṁkaḍeśha yiṁti nannu nĕnasĕnu
mattili viraha mim̐ka malasinā nedi