Seli yimka nemisesu seyamgala seva sese

చెలి యిఁక నేమిసేసు సేయఁగల సేవ సేసె
Language

(॥పల్లవి॥)
చెలి యిఁక నేమిసేసు సేయఁగల సేవ సేసె
నెలకొన్న విభుఁడవు నీ వెఱఁగవా

(॥చెలి॥)
చిగురుఁబెదవివంచి చెప్పినయట్టిప్రియాలు
తగిలి నీతోఁ గొసరేతలపోఁతలు
మొగము చూచిచూచి మొక్కినట్టిమొక్కులు
నిగిడి నే జప్పనేల నీ వెఱఁగవా

(॥చెలి॥)
యిచ్చకముగా నీకు నిచ్చినయట్టికానుక
కొచ్చి నీపైఁ జల్లినకూరిములు
విచ్చనవిడిని నిన్ను వేఁడుకొన్న వేడుకలు
నిచ్చ నెచ్చరించనేల నీ వెఱఁగవా

(॥చెలి॥)
సన్నల మోవిచూపిన జాలువారే తేనెలు
కన్నుల నవ్వి చేకొన్న కాఁగిలింపులు
యెన్నఁగ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
నిన్నుఁ గూడె నిన్నియును నీ వెఱఁగవా

(||pallavi||)
sĕli yim̐ka nemisesu seyam̐gala seva sesĕ
nĕlagŏnna vibhum̐ḍavu nī vĕṟam̐gavā

(||sĕli||)
sigurum̐bĕdavivaṁchi sĕppinayaṭṭipriyālu
tagili nīdom̐ gŏsaredalabom̐talu
mŏgamu sūsisūsi mŏkkinaṭṭimŏkkulu
nigiḍi ne jappanela nī vĕṟam̐gavā

(||sĕli||)
yichchagamugā nīgu nichchinayaṭṭigānuga
kŏchchi nībaim̐ jallinagūrimulu
vichchanaviḍini ninnu vem̐ḍugŏnna veḍugalu
nichcha nĕchchariṁchanela nī vĕṟam̐gavā

(||sĕli||)
sannala movisūbina jāluvāre tenĕlu
kannula navvi segŏnna kām̐giliṁpulu
yĕnnam̐ga śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
ninnum̐ gūḍĕ ninniyunu nī vĕṟam̐gavā