చెలి యాతనికి నీవే చెప్పవే బుద్ది
(॥పల్లవి॥)
చెలి యాతనికి నీవే చెప్పవే బుద్ది
వొలపక్షాల కింతేసి వోపుదునటే
(॥చెలి॥)
కాతరించి పలికేది కమ్మటి వేఁడుకొనేది
ఆతనికిది సాజము ఆయలేవే
పోతరించి వున్న వాఁడు పొద్దువోక పెనఁగీని
వో తరుణి తనతో నేనోపుదునటే
(॥చెలి॥)
దుండగాలు సేసేది తూరి యానలు వెట్టేది
నిండ నాతనివిద్యలు నేఁడు గొత్తలా
కండ గర్వముకలవాఁడు కైకొని చేతులు చాఁచీ
వుండవే యింతేసిపని కోపదునటే
(॥చెలి॥)
కన్నుల జంకించేది కాఁగిలించి కూడేది
పన్ని శ్రీ వేంకటేశుని బయకారాలు
మన్నించె నన్నల మేలుమంగను నే ననఁగాను
వున్నతి నెదురాడఁగ నోపుదునటే
(||pallavi||)
sĕli yādanigi nīve sĕppave buddi
vŏlabakṣhāla kiṁtesi vobudunaḍe
(||sĕli||)
kādariṁchi paligedi kammaḍi vem̐ḍugŏnedi
ādanigidi sājamu āyaleve
podariṁchi vunna vām̐ḍu pŏdduvoga pĕnam̐gīni
vo taruṇi tanado nenobudunaḍe
(||sĕli||)
duṁḍagālu sesedi tūri yānalu vĕṭṭedi
niṁḍa nādanividyalu nem̐ḍu gŏttalā
kaṁḍa garvamugalavām̐ḍu kaigŏni sedulu sām̐sī
vuṁḍave yiṁtesibani kobadunaḍe
(||sĕli||)
kannula jaṁkiṁchedi kām̐giliṁchi kūḍedi
panni śhrī veṁkaḍeśhuni bayagārālu
manniṁchĕ nannala melumaṁganu ne nanam̐gānu
vunnadi nĕdurāḍam̐ga nobudunaḍe