Seli vinnavimchave nem jeppenamte siggayyeeni

చెలి విన్నవించవే నేఁ జెప్పేనంటే సిగ్గయ్యీని
Language

(॥పల్లవి॥)
చెలి విన్నవించవే నేఁ జెప్పేనంటే సిగ్గయ్యీని
బలిమిఁ గాదని తోయఁ బంతగత్తెనా

(॥చెలి॥)
నేనెంతటి దానను నెట్టుక నొడఁ బరచీ
తానెంతమన్నించినాను తనచిత్తము
వూని యెంతవేడుఁకొనీ నూడిగపుదాన నింతే
కానీవే తనమాట గాదనేనా

(॥చెలి॥)
తనకేమి బాతి నేను తఱచుగా నాతో నవ్వీ
నను నెంతలాలించినా నాభాగ్యము
చెనకి యెంతమెచ్చీఁ దాఁ జేసినమానిసి నింతే
తననిచ్చదానఁగాక తగదనేనా

(॥చెలి॥)
సతులతోఁ బోగడీ నాచక్కఁదన మేమున్నది
రతి నెంతగూడినా సమ్మతమే నాకు
యితవై శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
సతముగా నన్ను నేలె చాలుననేనా

(||pallavi||)
sĕli vinnaviṁchave nem̐ jĕppenaṁṭe siggayyīni
balimim̐ gādani toyam̐ baṁtagattĕnā

(||sĕli||)
nenĕṁtaḍi dānanu nĕṭṭuga nŏḍam̐ barasī
tānĕṁtamanniṁchinānu tanasittamu
vūni yĕṁtaveḍum̐kŏnī nūḍigabudāna niṁte
kānīve tanamāḍa gādanenā

(||sĕli||)
tanagemi bādi nenu taṟasugā nādo navvī
nanu nĕṁtalāliṁchinā nābhāgyamu
sĕnagi yĕṁtamĕchchīm̐ dām̐ jesinamānisi niṁte
tananichchadānam̐gāga tagadanenā

(||sĕli||)
saduladom̐ bogaḍī nāsakkam̐dana memunnadi
radi nĕṁtagūḍinā sammadame nāgu
yidavai śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
sadamugā nannu nelĕ sālunanenā