Seli seppinattu neevu seyaraadaa

చెలి చెప్పినట్టు నీవు సేయరాదా
Language

(॥పల్లవి॥)
చెలి చెప్పినట్టు నీవు సేయరాదా
పెలుచుఁదనాన నేల బిగిసేవు

(॥చెలి॥)
సారెసారె నీతో సలిగకుఁ బెనఁగఁగా
మారుకొన నేమిటికి మగువతోను
కోరి వేఁడి నిన్నుఁ గొసరి కొంగువట్టితే
ఆరితేరి యాల అలసేవు

(॥చెలి॥)
పచ్చి వచ్చి నాతో వావులు చెప్పఁగా
కుచ్చితములేమిటికి కోమలితోను
మచ్చికసేసి నీతో మాటలాడఁగాను
పచ్చి సేసి యింత యాల పదరేవు

(॥చెలి॥)
కదిసి కదిసి నిన్నుఁగప్పురములడుగఁగా
వుదుటు జంకెనలేల వువిదతోను
మొదల శ్రీవేంకటేశ మొగము చూడఁగాను
అది యాల పరవశమందేవు

(||pallavi||)
sĕli sĕppinaṭṭu nīvu seyarādā
pĕlusum̐danāna nela bigisevu

(||sĕli||)
sārĕsārĕ nīdo saligagum̐ bĕnam̐gam̐gā
mārugŏna nemiḍigi maguvadonu
kori vem̐ḍi ninnum̐ gŏsari kŏṁguvaṭṭide
ārideri yāla alasevu

(||sĕli||)
pachchi vachchi nādo vāvulu sĕppam̐gā
kuchchidamulemiḍigi komalidonu
machchigasesi nīdo māḍalāḍam̐gānu
pachchi sesi yiṁta yāla padarevu

(||sĕli||)
kadisi kadisi ninnum̐gappuramulaḍugam̐gā
vuduḍu jaṁkĕnalela vuvidadonu
mŏdala śhrīveṁkaḍeśha mŏgamu sūḍam̐gānu
adi yāla paravaśhamaṁdevu