చెలి పరిణామపు సుద్దులు చెప్పితి మిదివో నీకును
(॥పల్లవి॥)
చెలి పరిణామపు సుద్దులు చెప్పితి మిదివో నీకును
యెలమిని మా విన్నప మిది యిఁక నీచిత్తమయా
(॥చెలి॥)
మంతనమున నీవాడినమాఁటలు దలఁచుక తలఁచుక
వంతల నొక్కొకపరి నీవలపులఁ జొక్కునయా
వింతలుగా నీవప్పుడు వేడుకఁ జేసిన చేఁతలు
చెంతలఁ దనతో మెలఁగేటి చెలులకుఁ జూపునయా
(॥చెలి॥)
పానుపు పై నీవెనసినబాగులు చెప్పుక చెప్పుక
నానావిధముల లో లో నవ్వులు నవ్వునయా
తానకముగ నీవక్కడఁ దలకిచ్చిన యధరామృత
మూనినచవు లిటుగొనుచును వుబ్బుచునుండునయా
(॥చెలి॥)
కూడుచు నీవటు చెనకినగుఱుతులు చూచుక చూచుక
వేడుకతోడుత నీరతి వేమరు మెచ్చునయా
యాడకు విచ్చేసి యేలితి వీకెను శ్రీవేంకటేశుఁడ
యాడును జోడై నీతో నిటువలె నుండునాయా
(||pallavi||)
sĕli pariṇāmabu suddulu sĕppidi midivo nīgunu
yĕlamini mā vinnaba midi yim̐ka nīsittamayā
(||sĕli||)
maṁtanamuna nīvāḍinamām̐ṭalu dalam̐suga talam̐suga
vaṁtala nŏkkŏgabari nīvalabulam̐ jŏkkunayā
viṁtalugā nīvappuḍu veḍugam̐ jesina sem̐talu
sĕṁtalam̐ danado mĕlam̐geḍi sĕlulagum̐ jūbunayā
(||sĕli||)
pānubu pai nīvĕnasinabāgulu sĕppuga sĕppuga
nānāvidhamula lo lo navvulu navvunayā
tānagamuga nīvakkaḍam̐ dalagichchina yadharāmṛta
mūninasavu liḍugŏnusunu vubbusunuṁḍunayā
(||sĕli||)
kūḍusu nīvaḍu sĕnaginaguṟudulu sūsuga sūsuga
veḍugadoḍuda nīradi vemaru mĕchchunayā
yāḍagu vichchesi yelidi vīgĕnu śhrīveṁkaḍeśhum̐ḍa
yāḍunu joḍai nīdo niḍuvalĕ nuṁḍunāyā