చెలి పలుసోఁకులే నీ సింగారము
(॥పల్లవి॥)
చెలి పలుసోఁకులే నీ సింగారము
అలరె నీకిన్నియును అవధారు నేఁడు
(॥॥)
అంగన నిన్నుఁగూడఁగ నటు నీపై వడిసేటి-
అంగపుఁ జెమట నీకు నభిషేకము
వుంగిటిఁ గొప్పువిరులు వుపరిసురతవేళ
సంగతి రాలేటిచల్లు వేదపూజ
(॥॥)
నించిన కాఁగిటిలోని నెలతఁ నిట్టూర్పుగాలి
అంచులు మోప విసరేయాలవట్టాలు
అంచెల మర్మముసోఁక నాడుకొనేమాటలే
కాంచనపు గిన్నెలతో కప్పురబాగాలు
(॥॥)
వనిత విడెముతోడ వంచినమోవితేనె
నునుపై నీకు మహనైవేద్యము
యెనసి శ్రీవేంకటేశ యిన్నియుఁ గలిగె నీకు
మొనగోరిమాచేతి మొక్కు లిందవయ్యా
(||pallavi||)
sĕli palusom̐kule nī siṁgāramu
alarĕ nīginniyunu avadhāru nem̐ḍu
(||||)
aṁgana ninnum̐gūḍam̐ga naḍu nībai vaḍiseḍi-
aṁgabum̐ jĕmaḍa nīgu nabhiṣhegamu
vuṁgiḍim̐ gŏppuvirulu vubarisuradaveḽa
saṁgadi rāleḍisallu vedabūja
(||||)
niṁchina kām̐giḍiloni nĕladam̐ niṭṭūrbugāli
aṁchulu moba visareyālavaṭṭālu
aṁchĕla marmamusom̐ka nāḍugŏnemāḍale
kāṁchanabu ginnĕlado kappurabāgālu
(||||)
vanida viḍĕmudoḍa vaṁchinamovidenĕ
nunubai nīgu mahanaivedyamu
yĕnasi śhrīveṁkaḍeśha yinniyum̐ galigĕ nīgu
mŏnagorimāsedi mŏkku liṁdavayyā