Seli ninnu dooreeni seppavayya yeedagavu

చెలి నిన్ను దూరీని చెప్పవయ్య యీతగవు
Language

(॥పల్లవి॥)
చెలి నిన్ను దూరీని చెప్పవయ్య యీతగవు
తలఁపించఁగలఁ గాక తమి రేఁచవచ్చునా

(॥॥)
వెలఁదిమాటలు నీకు విన్నవించఁగలఁ గాక
వలపించ నావసమా వరుసతోను
చెలఁగి నీకుఁ బ్రియము చెప్పఁగ నేఁ గలఁ గాక
బలిమిసేసి నిన్నుఁ బిలువఁగవచ్చునా

(॥॥)
కాంత ఇచ్చెనని నీకు గాను కియ్యఁగలఁ గాక
వంతులకు మెడఁగట్టవచ్చునా నిన్ను
మంతనాన నీకెఁ దెచ్చి మాటాడించఁగలఁ గాక
వింతలుగా నిన్ను వెంటవెంటఁ దిప్పవచ్చునా

(॥॥)
తరుణికి నీకుఁ దెర తగ వేయఁగలఁగాక
సరిఁ బెట్టి కాఁగిలింపించఁగవచ్చునా
గొరబై శ్రీవేంకటేశ కూడితి విట్టె యీకెను
యిరవై మెచ్చఁగలఁగా కెదురాడవచ్చునా

(||pallavi||)
sĕli ninnu dūrīni sĕppavayya yīdagavu
talam̐piṁcham̐galam̐ gāga tami rem̐savachchunā

(||||)
vĕlam̐dimāḍalu nīgu vinnaviṁcham̐galam̐ gāga
valabiṁcha nāvasamā varusadonu
sĕlam̐gi nīgum̐ briyamu sĕppam̐ga nem̐ galam̐ gāga
balimisesi ninnum̐ biluvam̐gavachchunā

(||||)
kāṁta ichchĕnani nīgu gānu kiyyam̐galam̐ gāga
vaṁtulagu mĕḍam̐gaṭṭavachchunā ninnu
maṁtanāna nīgĕm̐ dĕchchi māḍāḍiṁcham̐galam̐ gāga
viṁtalugā ninnu vĕṁṭavĕṁṭam̐ dippavachchunā

(||||)
taruṇigi nīgum̐ dĕra taga veyam̐galam̐gāga
sarim̐ bĕṭṭi kām̐giliṁpiṁcham̐gavachchunā
gŏrabai śhrīveṁkaḍeśha kūḍidi viṭṭĕ yīgĕnu
yiravai mĕchcham̐galam̐gā kĕdurāḍavachchunā