చెలి నీవు సేసవెట్టి సిగ్గులింకేలే
(॥పల్లవి॥)
చెలి నీవు సేసవెట్టి సిగ్గులింకేలే
ఫలము దెలుసుకొమ్మీ పతి యిందున్నాఁడు
(॥చెలి॥)
తరుణి నీవు బింబాధరివి
సరిఁ జిలుకపలుకు లిచ్చట నీకేలే
పొరసి మోవిఁ జిలుకపోట్లౌఁ జుమ్మీ
వరుస నీరమణుఁడు వద్దనే వున్నాఁడు
(॥చెలి॥)
అంగన నీవు చకోరాక్షివి
అంగడి వన్నలనవ్వు లవి నీకేలే
ముంగిటఁ బొత్తుగలసి యెంగిలౌఁజుమ్మీ
చెంగట నీరమణుఁడు చేకొని యున్నాఁడు
(॥చెలి॥)
కోమలిరొ కరికుంభకుచవు నీవు
ఆమైఁ జెమటమడుగు లవి నీకేలే
గామిడిజవ్వన మిది కలగీఁ జుమ్మీ
యామేర శ్రీవేంకటేశుఁ డిటు నిన్నుఁ గూడె
(||pallavi||)
sĕli nīvu sesavĕṭṭi sigguliṁkele
phalamu dĕlusugŏmmī padi yiṁdunnām̐ḍu
(||sĕli||)
taruṇi nīvu biṁbādharivi
sarim̐ jilugabalugu lichchaḍa nīgele
pŏrasi movim̐ jilugaboṭlaum̐ jummī
varusa nīramaṇum̐ḍu vaddane vunnām̐ḍu
(||sĕli||)
aṁgana nīvu sagorākṣhivi
aṁgaḍi vannalanavvu lavi nīgele
muṁgiḍam̐ bŏttugalasi yĕṁgilaum̐jummī
sĕṁgaḍa nīramaṇum̐ḍu segŏni yunnām̐ḍu
(||sĕli||)
komalirŏ kariguṁbhagusavu nīvu
āmaim̐ jĕmaḍamaḍugu lavi nīgele
gāmiḍijavvana midi kalagīm̐ jummī
yāmera śhrīveṁkaḍeśhum̐ ḍiḍu ninnum̐ gūḍĕ