చెలి నీవు మొదలనే సిగ్గరిపెండ్లికూఁతుర
(॥పల్లవి॥)
చెలి నీవు మొదలనే సిగ్గరిపెండ్లికూఁతుర-
విల నింత పచ్చిదేరీ నిదివో నీభావము
(॥చెలి॥)
చెక్కులవెంటాఁగారేచెమట దుడుచుకొవే
చక్కఁబెట్టుకోనవే నీజారినకొప్పు
అక్కుమీఁదఁ బెనగోన్నహారాలు
చిక్కుదియ్యవే యిక్కువల నీకోరిక లీడేకె నిపుడు
(॥చెలి॥)
పెదవిమీఁది కెంపుల బేంట్లు రాలుచుకొవే
చెదరినముంగురులు చేత దువ్వవే
వదలినపయ్యద చివ్వన బిగించుకొనవే
పదిఁబదిగా నీనోము ఫలియించె నిపుడు
(॥చెలి॥)
తిలకము గరఁగెను దిద్దుకొవే నోసలను
కలసినగురుతులు గప్పుకోనవే
యెలమి శ్రీవేంకటేశుఁ డేల నలమేల్‌మంగవు
తలఁచినతలఁపులు తలకూడె నిపుడు
(||pallavi||)
sĕli nīvu mŏdalane siggaribĕṁḍligūm̐tura-
vila niṁta pachchiderī nidivo nībhāvamu
(||sĕli||)
sĕkkulavĕṁṭām̐gāresĕmaḍa duḍusugŏve
sakkam̐bĕṭṭugonave nījārinagŏppu
akkumīm̐dam̐ bĕnagonnahārālu
sikkudiyyave yikkuvala nīgoriga līḍegĕ nibuḍu
(||sĕli||)
pĕdavimīm̐di kĕṁpula beṁṭlu rālusugŏve
sĕdarinamuṁgurulu seda duvvave
vadalinabayyada sivvana bigiṁchugŏnave
padim̐badigā nīnomu phaliyiṁchĕ nibuḍu
(||sĕli||)
tilagamu garam̐gĕnu diddugŏve nosalanu
kalasinagurudulu gappugonave
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍela nalamelmaṁgavu
talam̐sinadalam̐pulu talagūḍĕ nibuḍu