Seli naagu neevu sese vubagaaramidi

చెలి నాకు నీవు సేసే వుపకారమిది
Language

(॥పల్లవి॥)
చెలి నాకు నీవు సేసే వుపకారమిది
వెలలేని గుణముల వేడుకకాఁడతఁడు

(॥చెలి॥)
వచ్చినదాఁకా నీవు వద్దనే కాచుకుండు
మెచ్చినదాఁకాఁ గొలువు మిగులాను
ఇచ్చిగించినందాఁక నింపుగ సేవలు సేయ
అచ్చపుఁ బొందులు సేయుమాతనికి నాకును

(॥చెలి॥)
సమ్మతించినందాఁక సారె విన్నపాలు సేయు
నెమ్మది బతైనదాఁకా నేర్పులు చూపు
కొమ్మని ఇచ్చినదాఁకా గుట్టునఁ జేయెత్తి మొక్కు
యిమ్ములఁ బొందులు సేయుమిద్దరికి నీవు

(॥చెల్లి॥)
నవ్వినదాఁకా నీవు ననుపులెల్లాఁ జేయు
మివ్వలీమోమైన దాఁకా నింపులు చల్లు
రవ్వగా శ్రీ వేంకటరాయఁడిదే నన్నుఁ గూడె
మవ్వపుఁబొందులు సేయు మాకు నీవెప్పుడును

(||pallavi||)
sĕli nāgu nīvu sese vubagāramidi
vĕlaleni guṇamula veḍugagām̐ḍadam̐ḍu

(||sĕli||)
vachchinadām̐kā nīvu vaddane kāsuguṁḍu
mĕchchinadām̐kām̐ gŏluvu migulānu
ichchigiṁchinaṁdām̐ka niṁpuga sevalu seya
achchabum̐ bŏṁdulu seyumādanigi nāgunu

(||sĕli||)
sammadiṁchinaṁdām̐ka sārĕ vinnabālu seyu
nĕmmadi badainadām̐kā nerbulu sūbu
kŏmmani ichchinadām̐kā guṭṭunam̐ jeyĕtti mŏkku
yimmulam̐ bŏṁdulu seyumiddarigi nīvu

(||sĕlli||)
navvinadām̐kā nīvu nanubulĕllām̐ jeyu
mivvalīmomaina dām̐kā niṁpulu sallu
ravvagā śhrī veṁkaḍarāyam̐ḍide nannum̐ gūḍĕ
mavvabum̐bŏṁdulu seyu māgu nīvĕppuḍunu