Seli maramguna nemi sesidivi seppavayya

చెలి మరఁగున నేమి చేసితివి చెప్పవయ్య
Language

(॥పల్లవి॥)
చెలి మరఁగున నేమి చేసితివి చెప్పవయ్య
పలుమారు లోఁగఁగఁ బనియేమి నీకు

(॥చెలి॥)
నాతిమోముఁ జందురుఁడు నవ్వువెన్నెల గాసీ
నీతెరిఁగి సిగ్గువడ నీకేఁటికి
చేతిమీఁద మెరచీ నీ చెక్కుటద్ద మిదె నేఁడు
యీతలఁ దలవంచే విది యేమి నీవు

(॥చెలి॥)
సుదతి నేత్రపుమీలు చూపుఁదుమ్మిదల రేఁచీ
కదిసి నీవేల మేను గప్పుకొనేవు
కదలీ నీయధరపు కమ్మనిమోవిపండు
పదపడి చిన్నఁబోవఁ బనియేమి నీకు

(॥చెలి॥)
కొమ్మకరపల్లవాలు గోరిపై వాండ్లు చూపీ
పిమ్మటికి వీఁగి తప్పించుకోనేల
యిమ్ముల శ్రీవేంకటేశ యిన్నిటా నిన్నీకె గూడె
సమ్మతించితివి ఇఁక జయమే యిన్నిటాను

(||pallavi||)
sĕli maram̐guna nemi sesidivi sĕppavayya
palumāru lom̐gam̐gam̐ baniyemi nīgu

(||sĕli||)
nādimomum̐ jaṁdurum̐ḍu navvuvĕnnĕla gāsī
nīdĕrim̐gi sigguvaḍa nīgem̐ṭigi
sedimīm̐da mĕrasī nī sĕkkuḍadda midĕ nem̐ḍu
yīdalam̐ dalavaṁche vidi yemi nīvu

(||sĕli||)
sudadi netrabumīlu sūbum̐dummidala rem̐sī
kadisi nīvela menu gappugŏnevu
kadalī nīyadharabu kammanimovibaṁḍu
padabaḍi sinnam̐bovam̐ baniyemi nīgu

(||sĕli||)
kŏmmagaraballavālu goribai vāṁḍlu sūbī
pimmaḍigi vīm̐gi tappiṁchugonela
yimmula śhrīveṁkaḍeśha yinniḍā ninnīgĕ gūḍĕ
sammadiṁchidivi im̐ka jayame yinniḍānu