చెలి మమ్ముఁ జెప్పుమని సిగ్గుతోడఁ దా నున్నది
(॥పల్లవి॥)
చెలి మమ్ముఁ జెప్పుమని సిగ్గుతోడఁ దా నున్నది
తలకొని యాకెతో మంతనమాడవయ్యా
(॥చెలి॥)
కన్నులచూపులనే కాంత నీకారతులెత్తీ
మన్నించి రావయ్యా లోనిమల్లసాలకు
చన్నులనే నిమ్మపండ్లు సారెకుఁ గానుకలిచ్చీ
చెన్నుగా నందుకొందువు చేయిచాఁచవయ్యా
(॥చెలి॥)
పచ్చిచిగురాకుమోవిఁ బళ్లెము నీకుఁబెట్టీ
ఇచ్చ విందారగింతువు ఇయ్యకొవయ్యా
ముచ్చటఁ గరకమలముల నిన్నుఁ బూజించీ
కొచ్చి కాఁగిటిలోనఁ జేకొనఁగదవయ్యా
(॥చెలి॥)
మొలకనవ్వులనే ముత్యాలసేస వెట్టీ
లలినాపెమోము చూచి లాలించవయ్యా
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
కలసితి నీకె నిట్టె కరుణించవయ్యా
(||pallavi||)
sĕli mammum̐ jĕppumani siggudoḍam̐ dā nunnadi
talagŏni yāgĕdo maṁtanamāḍavayyā
(||sĕli||)
kannulasūbulane kāṁta nīgāradulĕttī
manniṁchi rāvayyā lonimallasālagu
sannulane nimmabaṁḍlu sārĕgum̐ gānugalichchī
sĕnnugā naṁdugŏṁduvu seyisām̐savayyā
(||sĕli||)
pachchisigurāgumovim̐ baḽlĕmu nīgum̐bĕṭṭī
ichcha viṁdāragiṁtuvu iyyagŏvayyā
muchchaḍam̐ garagamalamula ninnum̐ būjiṁchī
kŏchchi kām̐giḍilonam̐ jegŏnam̐gadavayyā
(||sĕli||)
mŏlaganavvulane mutyālasesa vĕṭṭī
lalinābĕmomu sūsi lāliṁchavayyā
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
kalasidi nīgĕ niṭṭĕ karuṇiṁchavayyā