చెలి జాణ గాకుండితే చేతుల బట్టఁగరాదు
(॥పల్లవి॥)
చెలి జాణ గాకుండితే చేతుల బట్టఁగరాదు
స్యెలమి నీ నానుడి యెఱఁగరా తాము
(॥చెలి॥)
జట్టిగొని నీవు నాకు చనవియ్యఁగాఁ జుమీ
కట్టఁగడవారికెల్ల కాఁకరేఁగెను
వొట్టి వొకరినోములు వొకరికి వచ్చునా
దట్టమైనతమ వెఱ్ఱితన మింతేకాక
(॥చెలి॥)
వుప్పటించి యింతలోనే వూరఁగలవారెల్ల
కప్పురమిచ్చితివంటా కాఁతాళించేరు
చిప్పిలి విత్తొకటియుఁ జెట్టొకటీ నౌనా
తప్పులెంచే తమ యెడ్డతన మింతే కాక
(॥చెలి॥)
శ్రీ వేంకటేశ నీవు చేరి నన్నుఁ గూడితేను
యీవల సవతులెల్లా యిచ్చలాడేవు
చేవదేర రాజు వలచినదే దేవులు గాదా
తావులను తమమంకుదన మింతేకాక
(||pallavi||)
sĕli jāṇa gāguṁḍide sedula baṭṭam̐garādu
syĕlami nī nānuḍi yĕṟam̐garā tāmu
(||sĕli||)
jaṭṭigŏni nīvu nāgu sanaviyyam̐gām̐ jumī
kaṭṭam̐gaḍavārigĕlla kām̐karem̐gĕnu
vŏṭṭi vŏgarinomulu vŏgarigi vachchunā
daṭṭamainadama vĕṭridana miṁtegāga
(||sĕli||)
vuppaḍiṁchi yiṁtalone vūram̐galavārĕlla
kappuramichchidivaṁṭā kām̐tāḽiṁcheru
sippili vittŏgaḍiyum̐ jĕṭṭŏgaḍī naunā
tappulĕṁche tama yĕḍḍadana miṁte kāga
(||sĕli||)
śhrī veṁkaḍeśha nīvu seri nannum̐ gūḍidenu
yīvala savadulĕllā yichchalāḍevu
sevadera rāju valasinade devulu gādā
tāvulanu tamamaṁkudana miṁtegāga