చెలి భ్రమల నీవేల చిక్కకుందువు
(॥పల్లవి॥)
చెలి భ్రమల నీవేల చిక్కకుందువు
తెలిపితే నీ గుణము తీరుకు వచ్చీనా
(॥చెలి॥)
జలజాక్షి మోవితేనె చందమామ గుటుకలు
పొలసి నీకుఁ దరితీపులు సేసెను
కలికిచూపులు మరుగాలపు వేఁటకొలుకులు
తలఁపు లోపలఁ జొచ్చి తగిలించుకొనెను
(॥చెలి॥)
మదిరాక్షిమాటలు మాయపు చొక్కు మందులు
యెదుట నిన్ను మదన మెత్తించెను
చెదరినచిరునవ్వు చిలుపాలవిందులు
వుదుటన నిన్ను నో రూరించ కుండునా
(॥చెలి॥)
తరుణికాఁగిలి నీకుఁదగినపెండ్లి చవికె
సరవి తోడుత సంతోము రేఁచెను
అరయ శ్రీవేంకటేశ అలమేలు మంగ యాకె
నిరతి న న్నేలించి నిన్నుఁదా మెప్పించెను
(||pallavi||)
sĕli bhramala nīvela sikkaguṁduvu
tĕlibide nī guṇamu tīrugu vachchīnā
(||sĕli||)
jalajākṣhi movidenĕ saṁdamāma guḍugalu
pŏlasi nīgum̐ daridībulu sesĕnu
kaligisūbulu marugālabu vem̐ṭagŏlugulu
talam̐pu lobalam̐ jŏchchi tagiliṁchugŏnĕnu
(||sĕli||)
madirākṣhimāḍalu māyabu sŏkku maṁdulu
yĕduḍa ninnu madana mĕttiṁchĕnu
sĕdarinasirunavvu silubālaviṁdulu
vuduḍana ninnu no rūriṁcha kuṁḍunā
(||sĕli||)
taruṇigām̐gili nīgum̐daginabĕṁḍli savigĕ
saravi toḍuda saṁtomu rem̐sĕnu
araya śhrīveṁkaḍeśha alamelu maṁga yāgĕ
niradi na nneliṁchi ninnum̐dā mĕppiṁchĕnu