సెలవుల నవ్వులాడ సిగ్గులు వడఁగనేల
(॥పల్లవి॥)
సెలవుల నవ్వులాడ సిగ్గులు వడఁగనేల
చలువగాఁ గెవ్మెూవి చవిచూపరాదా
(॥॥)
నేరుపెల్లా మెరయుచు నీతో మాటలాడీఁజెలి
వూరటలు సేసుకొని వూఁకొనవయ్యా
ఆరయ వీడెమిచ్చి ఆకులు చుట్టిచ్చీని
ఆరీతి చేతులు మార్చి అందుకొనరాదా
(॥॥)
తమకమెల్లాఁ యెంచి తప్పక చూచీఁజెలి
సుముఖుఁడవై మోము చూపవయ్యా
అమర సింగారించి యట్టె విరులు ముడిచీ
రమణితొడపై నీశిరసు మోపరాదా
(॥॥)
గొరబు లెల్లాఁ జేసి కుచముల నొత్తీఁ జెలి
వుర మాపె కొప్పగించి వుండవయ్యా
యిరవై శ్రీవేంకటేశ యేవితివి నన్ను నిట్టె
మరిగి యాపెను నీవు మన్నించరాదా
(||pallavi||)
sĕlavula navvulāḍa siggulu vaḍam̐ganela
saluvagām̐ gĕvmĕూvi savisūbarādā
(||||)
nerubĕllā mĕrayusu nīdo māḍalāḍīm̐jĕli
vūraḍalu sesugŏni vūm̐kŏnavayyā
āraya vīḍĕmichchi āgulu suṭṭichchīni
ārīdi sedulu mārsi aṁdugŏnarādā
(||||)
tamagamĕllām̐ yĕṁchi tappaga sūsīm̐jĕli
sumukhum̐ḍavai momu sūbavayyā
amara siṁgāriṁchi yaṭṭĕ virulu muḍisī
ramaṇidŏḍabai nīśhirasu mobarādā
(||||)
gŏrabu lĕllām̐ jesi kusamula nŏttīm̐ jĕli
vura mābĕ kŏppagiṁchi vuṁḍavayyā
yiravai śhrīveṁkaḍeśha yevidivi nannu niṭṭĕ
marigi yābĕnu nīvu manniṁcharādā