సెలవుల నవ్వే నేఁ జేసిన చేఁతల కెల్ల
(॥పల్లవి॥)
సెలవుల నవ్వే నేఁ జేసిన చేఁతల కెల్ల
తొలుతటివలె నిఁక దూరఁ బనిలేదే
(॥॥)
తప్పెంచ నేరనిదానఁ దల వంచితే నేమాయ
వుప్పతించీ నందుకుఁగా నూరకే తాను
చప్పని వలపులకు సాజ మిటువలె నౌనే
అప్పటిని తను నిఁక నాడఁ బనిలేదే
(॥॥)
కోపంచఁ జాలనిదాన గుట్టుతో నుంటే నేమాయ
రాఁపు సేసీ నందుకుఁగా రచ్చలో నెల్లా
తోపునకుడై న వారితోడి సుద్దులిట్లానే
చాపలానఁ దను నేఁ గొసరఁ బనిలేదే
(॥॥)
సాదించ నొల్లనిదానఁ జల్ల గాఁనుంటే నేమాయ
బోదించీ నందుకుఁగాను పొద్దు వోదా
యీదెసఁ గూడె శ్రీవేంకటేశుఁడు నన్నిట్లానే
కాదు గూడదనఁగ నింకాఁ బనిలేదే
(||pallavi||)
sĕlavula navve nem̐ jesina sem̐tala kĕlla
tŏludaḍivalĕ nim̐ka dūram̐ banilede
(||||)
tappĕṁcha neranidānam̐ dala vaṁchide nemāya
vuppadiṁchī naṁdugum̐gā nūrage tānu
sappani valabulagu sāja miḍuvalĕ naune
appaḍini tanu nim̐ka nāḍam̐ banilede
(||||)
kobaṁcham̐ jālanidāna guṭṭudo nuṁṭe nemāya
rām̐pu sesī naṁdugum̐gā rachchalo nĕllā
tobunaguḍai na vāridoḍi sudduliṭlāne
sābalānam̐ danu nem̐ gŏsaram̐ banilede
(||||)
sādiṁcha nŏllanidānam̐ jalla gām̐nuṁṭe nemāya
bodiṁchī naṁdugum̐gānu pŏddu vodā
yīdĕsam̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu nanniṭlāne
kādu gūḍadanam̐ga niṁkām̐ banilede