Selavula navvanela siggulu vadamganela

సెలవుల నవ్వనేల సిగ్గులు వడఁగనేల
Language

(॥పల్లవి॥)
సెలవుల నవ్వనేల సిగ్గులు వడఁగనేల
అలివేణిఁ బోదిసేసి ఆడరాదా మేలము

(॥సెల॥)
కూరిమితో నీకు కొమ్మ నిన్ను సొలసెను
నేరుపుల మాటలెల్లా నీతో నాడెను
చేరి యిఁక దరవాతిచేఁతలు నీచేతి దింతే
ఆరీతినే గారవించి యాడరాదా మేలము

(॥సెల॥)
వినయము లన్నీఁ జూపి వెలఁది నిన్ను మెప్పించె
చలవుసేసుక నీతో సరి వెనఁగె
తనర నిఁక మన్నించే తగవు నీచేతి దింతే
అనువుగా బుజ్జగించి ఆడరాదా మేలము

(॥సెల॥)
మరుగుచు నలమేలుమఁగ నిన్ను దమిరేఁచె
సరసము నీతోనాడి చవి వుట్టించె
సరుగ శ్రీవేంకటేశ సరి నీకెఁ గూడితివి
అరిమురి లాలించి ఆడరాదా మేలము

(||pallavi||)
sĕlavula navvanela siggulu vaḍam̐ganela
aliveṇim̐ bodisesi āḍarādā melamu

(||sĕla||)
kūrimido nīgu kŏmma ninnu sŏlasĕnu
nerubula māḍalĕllā nīdo nāḍĕnu
seri yim̐ka daravādisem̐talu nīsedi diṁte
ārīdine gāraviṁchi yāḍarādā melamu

(||sĕla||)
vinayamu lannīm̐ jūbi vĕlam̐di ninnu mĕppiṁchĕ
salavusesuga nīdo sari vĕnam̐gĕ
tanara nim̐ka manniṁche tagavu nīsedi diṁte
anuvugā bujjagiṁchi āḍarādā melamu

(||sĕla||)
marugusu nalamelumam̐ga ninnu damirem̐sĕ
sarasamu nīdonāḍi savi vuṭṭiṁchĕ
saruga śhrīveṁkaḍeśha sari nīgĕm̐ gūḍidivi
arimuri lāliṁchi āḍarādā melamu