సెలవి నవ్వులతోడఁ జింత లేలయ్యా
(॥పల్లవి॥)
సెలవి నవ్వులతోడఁ జింత లేలయ్యా
చెలఁగి మా మండాటాలు చేకొనరాదా
(॥॥)
విరహపు చెలిలాగు వింటే దోసము గాదు
గిరిగొనఁ గొంత అలకించవయ్యా
అరుదుగా విన్నవించే నదేల పరాకు నీకు
అరసి న న్నదేమని యడుగరాదా
(॥॥)
ఆసపడ్డ సతితో మాటాడితే దోసము గాదు
లేసు పెదవులు గదలించవయ్యా
చేసూటినే చూపెను సిగ్గు లిదేఁటికి నీకు
సేసపాలు వట్టు కొని శిరసెత్తరాదా
(॥॥)
అండనున్న యా లేమ నంటితే దోసము గాదు
నిండుఁ గౌఁగిట నీవు నించవయ్యా
కొండల శ్రీ వేంకటేశ కోరి యలమేల్మంగను
దండిగా నేలితి విట్టే దయ సేయరాదా
(||pallavi||)
sĕlavi navvuladoḍam̐ jiṁta lelayyā
sĕlam̐gi mā maṁḍāḍālu segŏnarādā
(||||)
virahabu sĕlilāgu viṁṭe dosamu gādu
girigŏnam̐ gŏṁta alagiṁchavayyā
arudugā vinnaviṁche nadela parāgu nīgu
arasi na nnademani yaḍugarādā
(||||)
āsabaḍḍa sadido māḍāḍide dosamu gādu
lesu pĕdavulu gadaliṁchavayyā
sesūḍine sūbĕnu siggu lidem̐ṭigi nīgu
sesabālu vaṭṭu kŏni śhirasĕttarādā
(||||)
aṁḍanunna yā lema naṁṭide dosamu gādu
niṁḍum̐ gaum̐giḍa nīvu niṁchavayyā
kŏṁḍala śhrī veṁkaḍeśha kori yalamelmaṁganu
daṁḍigā nelidi viṭṭe daya seyarādā