సెలవి నవ్వులతోడ సిగ్గులతోడ
(॥పల్లవి॥)
సెలవి నవ్వులతోడ సిగ్గులతోడ
తలఁపించరే పనులు తమితోనున్నారు
(॥సెల॥)
పంతములాడే రిద్దరు బాగా లియ్యఁగదరే
వంతల కొకరొకరి వంకలాడరే
మంతనమాడేరేమొ మరి తెరవేయరే
కాంతయుఁ బురుషుఁడును గద్దెపై నున్నారు
(॥సెల॥)
సరసమాడే రిద్దరు సంగడి నుండఁగదరే
అరిది మర్మపుమాఁట లందీయరే
కరఁగి మోహించేరేమో కందువలు దెలుపరే
సరికి బేసికిని మంచముపై నున్నారు
(॥సెల॥)
యెనసిరి శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగయు
మొనయుచు నుపచారములు సేయరె
చనవులు గొసరేరేమొ సమరతి నుపరతి
పెనచి మొక్కరె పెండ్లిపీఁటపయి నున్నారు
(||pallavi||)
sĕlavi navvuladoḍa sigguladoḍa
talam̐piṁchare panulu tamidonunnāru
(||sĕla||)
paṁtamulāḍe riddaru bāgā liyyam̐gadare
vaṁtala kŏgarŏgari vaṁkalāḍare
maṁtanamāḍeremŏ mari tĕraveyare
kāṁtayum̐ buruṣhum̐ḍunu gaddĕbai nunnāru
(||sĕla||)
sarasamāḍe riddaru saṁgaḍi nuṁḍam̐gadare
aridi marmabumām̐ṭa laṁdīyare
karam̐gi mohiṁcheremo kaṁduvalu dĕlubare
sarigi besigini maṁchamubai nunnāru
(||sĕla||)
yĕnasiri śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgayu
mŏnayusu nubasāramulu seyarĕ
sanavulu gŏsareremŏ samaradi nubaradi
pĕnasi mŏkkarĕ pĕṁḍlibīm̐ṭabayi nunnāru