Selavi navvuladoda siggayyaa naagu

సెలవి నవ్వులతోడ సిగ్గయ్యా నాకు
Language

(॥పల్లవి॥)
సెలవి నవ్వులతోడ సిగ్గయ్యా నాకు
చెలులు చూడగ నింత సేతురా అయ్యా

(॥సెల॥)
గందము పూసేటివేళ కంటమాల నామెడను
అందముగాఁ బెట్టితివి అవునయ్యా
యిందులోనే నీ సతులు యెవ్వరు చూచినాను
నింద లేమి గట్టుదురో నీ విదేమయ్యా

(॥సెల॥)
కొప్పు చిక్కుదీకొంటా గురుతైనకడియాలు
అప్పటి నాచేతఁ బెట్టే వవునయ్యా
వుప్పటించి నీసతులు వూరకైనాఁ దమవంటా
చొప్పున వత్తురొ యేమో చూచుకోవయ్యా

(॥సెల॥)
పాదాలు గుద్దేటివేళ పచ్చడము నామీఁద
ఆదిగొని కప్పితివి అవునయ్యా
యీదెస శ్రీవేంకటేశ యింత సేసి కూడితివి
వాదడిచే నీ సతుల వద్దనవయ్యా

(||pallavi||)
sĕlavi navvuladoḍa siggayyā nāgu
sĕlulu sūḍaga niṁta sedurā ayyā

(||sĕla||)
gaṁdamu pūseḍiveḽa kaṁṭamāla nāmĕḍanu
aṁdamugām̐ bĕṭṭidivi avunayyā
yiṁdulone nī sadulu yĕvvaru sūsinānu
niṁda lemi gaṭṭuduro nī videmayyā

(||sĕla||)
kŏppu sikkudīgŏṁṭā gurudainagaḍiyālu
appaḍi nāsedam̐ bĕṭṭe vavunayyā
vuppaḍiṁchi nīsadulu vūragainām̐ damavaṁṭā
sŏppuna vatturŏ yemo sūsugovayyā

(||sĕla||)
pādālu guddeḍiveḽa pachchaḍamu nāmīm̐da
ādigŏni kappidivi avunayyā
yīdĕsa śhrīveṁkaḍeśha yiṁta sesi kūḍidivi
vādaḍise nī sadula vaddanavayyā