Selaremgi koluvulu seduvugaaga

చెలరేఁగి కొలువులు సేతువుగాక
Language

(॥పల్లవి॥)
చెలరేఁగి కొలువులు సేతువుగాక
మలసి నీకు తెరమఱఁగు లేమిటికే

(॥॥)
అగ్గలపుమోమున నతఁడు నీ మోము చూచీ
సిగ్గులువడకువే చెలియా
వెగ్గళపుఁ దమకము వెదచల్లీ నీమీఁద
తగ్గి నీవందుకుఁగాను తలవంచనేఁటికే

(॥॥)
మనసిచ్చి యప్పటిని మాటలు నీతో నాడీ
వెనకతియ్యకువె వెలఁదీ
ననుపునఁ జన్నులపై నగుతానే చేయిచాఁచీ
పెనఁగి నీవంతేసి బిగియఁగ నేఁటికే

(॥॥)
ఆఱఢై శ్రీవేంకటేశుఁ డట్టె నిన్నుఁ గాఁగిలించీ
మీఱకువే యిఁక నలమేలుమంగా
కాఱుకమ్మినరతులఁ గలసె నిన్నీతఁడు
ఆఱితేరెఁ బనులెల్లా నలయించనేఁటికే

(||pallavi||)
sĕlarem̐gi kŏluvulu seduvugāga
malasi nīgu tĕramaṟam̐gu lemiḍige

(||||)
aggalabumomuna nadam̐ḍu nī momu sūsī
sigguluvaḍaguve sĕliyā
vĕggaḽabum̐ damagamu vĕdasallī nīmīm̐da
taggi nīvaṁdugum̐gānu talavaṁchanem̐ṭige

(||||)
manasichchi yappaḍini māḍalu nīdo nāḍī
vĕnagadiyyaguvĕ vĕlam̐dī
nanubunam̐ jannulabai nagudāne seyisām̐sī
pĕnam̐gi nīvaṁtesi bigiyam̐ga nem̐ṭige

(||||)
āṟaḍhai śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ ninnum̐ gām̐giliṁchī
mīṟaguve yim̐ka nalamelumaṁgā
kāṟugamminaradulam̐ galasĕ ninnīdam̐ḍu
āṟiderĕm̐ banulĕllā nalayiṁchanem̐ṭige