చెలఁగి నీవెట్టుండినాఁ జెల్లదా యెమ్మి (యేమి?)
(॥పల్లవి॥)
చెలఁగి నీవెట్టుండినాఁ జెల్లదా యెమ్మి (యేమి?)
తల వంచుకొని యేల తగఁ జింతించేవు
(॥చెల॥)
చనవు చేసుకొని సతి నీవద్దఁ గూచుండి
యెనసి నవ్వితే నీవు యెగ్గుపట్టేవు
ఘనుఁడ వేమిచేసినాఁ గాదనేటివారెవ్వరు
పనిలేనిపని కేల పక్కన లోఁగేవు
(॥చెల॥)
కూడేవేళ నీ మేనిగుఱుతు లాపె చూచి
వేడుకతో మెచ్చితేనే వెంగెమ నేవు
కోడెకాఁడ నీగుణము కొలఁదికి దిద్దరాదు
చేడెలముందర నేల సిబ్బతిపడేవు
(॥చెల॥)
అడియాల మంపఁగానే అంగన వచ్చి చన్నుల
కడునొత్తితేనేల గర్వమనేవు
యెడయక శ్రీవేంకటేశ నీవు మగఁడవు
బడినే కూడితి వేల బాసలు సేసేవు
(||pallavi||)
sĕlam̐gi nīvĕṭṭuṁḍinām̐ jĕlladā yĕmmi (yemi?)
tala vaṁchugŏni yela tagam̐ jiṁtiṁchevu
(||sĕla||)
sanavu sesugŏni sadi nīvaddam̐ gūsuṁḍi
yĕnasi navvide nīvu yĕggubaṭṭevu
ghanum̐ḍa vemisesinām̐ gādaneḍivārĕvvaru
panilenibani kela pakkana lom̐gevu
(||sĕla||)
kūḍeveḽa nī meniguṟudu lābĕ sūsi
veḍugado mĕchchidene vĕṁgĕma nevu
koḍĕgām̐ḍa nīguṇamu kŏlam̐digi diddarādu
seḍĕlamuṁdara nela sibbadibaḍevu
(||sĕla||)
aḍiyāla maṁpam̐gāne aṁgana vachchi sannula
kaḍunŏttidenela garvamanevu
yĕḍayaga śhrīveṁkaḍeśha nīvu magam̐ḍavu
baḍine kūḍidi vela bāsalu sesevu