చెలఁగి నావిభుఁ డింతసేయుమనెనా
(॥పల్లవి॥)
చెలఁగి నావిభుఁ డింతసేయుమనెనా
చలమరి కోరికలు సాదించీఁ గాక
(॥॥)
మాయదారిమరునేటు మనసులో గుఱి యింతే
కాయముమీఁదికినేల కాఁకరేఁగీనే
పాయపుమోహము లివి బయలీఁదేపను లింతే
ఆయపునిట్టూర్పులేల అలయించీనే
(॥॥)
చందురునివెన్నెలలు జగమెఱిఁగిన వింతే
పందె మాడి నన్నునేల భ్రమయించీనే
కుందనికోవిలకూఁత కుత్తికలో పస యింతే
సందడి నాగుండె యేల జాలిరేఁచీనే
(॥॥)
పంతపుటీచల్లగాలి పాణముతోలంకె యింతే
వింతలుగా నన్నునేల వేసరించీనే
యింతలోన శ్రీ వేంకటేశుఁడు గలయఁగాను
చింతలెల్లా బాపెఁగాక సిగ్గులేల ముంచీనే
(||pallavi||)
sĕlam̐gi nāvibhum̐ ḍiṁtaseyumanĕnā
salamari korigalu sādiṁchīm̐ gāga
(||||)
māyadārimaruneḍu manasulo guṟi yiṁte
kāyamumīm̐diginela kām̐karem̐gīne
pāyabumohamu livi bayalīm̐debanu liṁte
āyabuniṭṭūrbulela alayiṁchīne
(||||)
saṁdurunivĕnnĕlalu jagamĕṟim̐gina viṁte
paṁdĕ māḍi nannunela bhramayiṁchīne
kuṁdanigovilagūm̐ta kuttigalo pasa yiṁte
saṁdaḍi nāguṁḍĕ yela jālirem̐sīne
(||||)
paṁtabuḍīsallagāli pāṇamudolaṁkĕ yiṁte
viṁtalugā nannunela vesariṁchīne
yiṁtalona śhrī veṁkaḍeśhum̐ḍu galayam̐gānu
siṁtalĕllā bābĕm̐gāga siggulela muṁchīne