Selagi yappudu samtosimchugomduvugaani

చెలగి యప్పుడు సంతోసించుకొందువుగాని
Language

(॥పల్లవి॥)
చెలగి యప్పుడు సంతోసించుకొందువుగాని
చలపట్టితని మోవి చౌలుగొనేను

(॥చెల॥)
చన వాతఁ డిచ్చెనంటా సారె నిన్నుఁ జూచెనంటా
యెనసి పెద్దరికము లేమిచెప్పేవే
ననుఁజూడు నీయెదుట నయమున నాతని
మనసు చొక్కించి నన్నే మరిగించుకొనేను

(॥చెల॥)
సొమ్ములు నీకిచ్చెనంటా చొప్పుగాఁ జెనకెనంటా
యెమ్మె లిందరికి నీవు యేమిచూపవే
కమ్మి నాపంతము విను గక్కన నాతనినా -
సొమ్ముచేసుకొని యీడుజోడై వుండేను

(॥చెల॥)
వలపించుకొంటినంటా వాడికై యున్నాఁడంటా
బలిమి నీనేరుపెంత పచారించేవే
కొలిచి శ్రీవేంకటాద్రి గోవిందరాజుకాఁగిట
నెలకొంటి నింకాను నిన్నే మెప్పించెను

(||pallavi||)
sĕlagi yappuḍu saṁtosiṁchugŏṁduvugāni
salabaṭṭidani movi saulugŏnenu

(||sĕla||)
sana vādam̐ ḍichchĕnaṁṭā sārĕ ninnum̐ jūsĕnaṁṭā
yĕnasi pĕddarigamu lemisĕppeve
nanum̐jūḍu nīyĕduḍa nayamuna nādani
manasu sŏkkiṁchi nanne marigiṁchugŏnenu

(||sĕla||)
sŏmmulu nīgichchĕnaṁṭā sŏppugām̐ jĕnagĕnaṁṭā
yĕmmĕ liṁdarigi nīvu yemisūbave
kammi nābaṁtamu vinu gakkana nādaninā -
sŏmmusesugŏni yīḍujoḍai vuṁḍenu

(||sĕla||)
valabiṁchugŏṁṭinaṁṭā vāḍigai yunnām̐ḍaṁṭā
balimi nīnerubĕṁta pasāriṁcheve
kŏlisi śhrīveṁkaḍādri goviṁdarājugām̐giḍa
nĕlagŏṁṭi niṁkānu ninne mĕppiṁchĕnu