Selaba semadalado simta yemtige

చెలప చెమటలతో చింత యేఁటికే
Language

(॥పల్లవి॥)
చెలప చెమటలతో చింత యేఁటికే
పిలిచి ప్రియముచెప్పి పెనఁగఁగరాదా

(॥॥)
యేలే తలపోతలు యెదుటఁ బతివుండఁగ
వాలుఁజూపులఁ జూచి నవ్వఁగరాదా
జాలిఁ బడ నిఁకనేలే చనవితఁ డియ్యఁ గాను
మేలమాడి సారె సారె మెప్పించరాదా

(॥॥)
హత్తి వుండి మోనమేలే ఆయములు సోకఁగ
చిత్తగించి మాటలాడి చేకొనరాదా
కొత్తకొత్తసిగ్గులేలే కొంగువట్టి యీతనిఁ
బత్తిసేసి రతులను పనిగొనరాదా

(॥॥)
మేటివి తలవంచనేటికే యలమేల్మంగ
సూటిగ శ్రీ వేంకటేశుఁ జూడఁగరాదా
నీటులేమిటికి మీరు నెట్టనఁ గూడితిరిట్టె
యీటుతో మదనరాజ్య మేలఁ గరాదా

(||pallavi||)
sĕlaba sĕmaḍalado siṁta yem̐ṭige
pilisi priyamusĕppi pĕnam̐gam̐garādā

(||||)
yele talabodalu yĕduḍam̐ badivuṁḍam̐ga
vālum̐jūbulam̐ jūsi navvam̐garādā
jālim̐ baḍa nim̐kanele sanavidam̐ ḍiyyam̐ gānu
melamāḍi sārĕ sārĕ mĕppiṁcharādā

(||||)
hatti vuṁḍi monamele āyamulu sogam̐ga
sittagiṁchi māḍalāḍi segŏnarādā
kŏttagŏttasiggulele kŏṁguvaṭṭi yīdanim̐
battisesi radulanu panigŏnarādā

(||||)
meḍivi talavaṁchaneḍige yalamelmaṁga
sūḍiga śhrī veṁkaḍeśhum̐ jūḍam̐garādā
nīḍulemiḍigi mīru nĕṭṭanam̐ gūḍidiriṭṭĕ
yīḍudo madanarājya melam̐ garādā