Sekkuseyim diyyaraadu siggulu vadagabodu

చెక్కుచేయిఁ దియ్యరాదు సిగ్గులు వడకపోదు
Language

(॥పల్లవి॥)
చెక్కుచేయిఁ దియ్యరాదు సిగ్గులు వడకపోదు
ఇక్కువ నా తడఁబాటు నేమిసేతునే

(॥చెక్కు॥)
మొక్కఁగా వీడినకొప్పు ముడుచుకొనఁగఁబోతే
పక్కనఁ జన్నులమీఁదిపయ్యద జారె
దక్కెఁ దనవంతము తలఁచినట్టె ఆయ
యెక్కువనా తమకము నేమిసేతునే

(॥చెక్కు॥)
మీటఁగా గట్టినవీణెమెట్టు చక్కఁబెట్టఁబోతే
పాటించి బాహుమూలాలా బయటఁబడె
సూటిఁబడఁ దననేర్పు చూచిన చూపు లీడేరె
యీటులేనినావలపు నేమిసేతునే

(॥చెక్కు॥)
వొరయఁగా వదలిన వొడ్డాణము పట్టఁబోతే
మురిపెపునాపోకముడి వీడెను
సరుస శ్రీవేంకటేశు సరసము నెరవేరె
యిరవైన పరవశ మేమిసేతునే

(||pallavi||)
sĕkkuseyim̐ diyyarādu siggulu vaḍagabodu
ikkuva nā taḍam̐bāḍu nemisedune

(||sĕkku||)
mŏkkam̐gā vīḍinagŏppu muḍusugŏnam̐gam̐bode
pakkanam̐ jannulamīm̐dibayyada jārĕ
dakkĕm̐ danavaṁtamu talam̐sinaṭṭĕ āya
yĕkkuvanā tamagamu nemisedune

(||sĕkku||)
mīḍam̐gā gaṭṭinavīṇĕmĕṭṭu sakkam̐bĕṭṭam̐bode
pāḍiṁchi bāhumūlālā bayaḍam̐baḍĕ
sūḍim̐baḍam̐ dananerbu sūsina sūbu līḍerĕ
yīḍulenināvalabu nemisedune

(||sĕkku||)
vŏrayam̐gā vadalina vŏḍḍāṇamu paṭṭam̐bode
muribĕbunābogamuḍi vīḍĕnu
sarusa śhrīveṁkaḍeśhu sarasamu nĕraverĕ
yiravaina paravaśha memisedune