చెక్కుచేయి నీకేలే చెలులతోఁ జెప్పనేలే
(॥పల్లవి॥)
చెక్కుచేయి నీకేలే చెలులతోఁ జెప్పనేలే
చక్కని విభునితోనే జంట నుందు గాక
(॥చెక్కు॥)
వలచిన నీకు నిఁక వాసులునుఁ జుల్లునటె
కొలఁదిగా నవ్వు సేసుకొనుట గాక
చెలిమినాటినమీద సిగ్గులునుఁ జెల్లునటె
జలిమి నాతనికంటెఁ బైకొందు గాక
(॥చెక్కు॥)
మాట పట్టిచ్చినచోట మతకాలు చెల్లునటె
వోటైనా నందాలు సేసుకొనుట గాక
యీటున సరసమాడి యెగ్గులెంచఁ జుల్లునటె
కూటములే గురిసేసుకొను టింతే కాక
(॥చెక్కు॥)
కాఁగిటఁ గూడినవేళ కళవళ మిఁకనేలే
వీఁగనిరతుల విఱ్ఱవీఁగుదు గాక
ఆఁగితి శ్రీవేంకటేశు నలములుమంగ నీవు
లోఁగనేలే యిన్నిటికి లోనౌట గాక
(||pallavi||)
sĕkkuseyi nīgele sĕluladom̐ jĕppanele
sakkani vibhunidone jaṁṭa nuṁdu gāga
(||sĕkku||)
valasina nīgu nim̐ka vāsulunum̐ jullunaḍĕ
kŏlam̐digā navvu sesugŏnuḍa gāga
sĕlimināḍinamīda siggulunum̐ jĕllunaḍĕ
jalimi nādanigaṁṭĕm̐ baigŏṁdu gāga
(||sĕkku||)
māḍa paṭṭichchinasoḍa madagālu sĕllunaḍĕ
voḍainā naṁdālu sesugŏnuḍa gāga
yīḍuna sarasamāḍi yĕggulĕṁcham̐ jullunaḍĕ
kūḍamule gurisesugŏnu ṭiṁte kāga
(||sĕkku||)
kām̐giḍam̐ gūḍinaveḽa kaḽavaḽa mim̐kanele
vīm̐ganiradula viṭravīm̐gudu gāga
ām̐gidi śhrīveṁkaḍeśhu nalamulumaṁga nīvu
lom̐ganele yinniḍigi lonauḍa gāga