Sekkusemadaladoda siggulagu lonaidi

చెక్కుచెమటలతోడ సిగ్గులకు లోనైతి
Language

(॥పల్లవి॥)
చెక్కుచెమటలతోడ సిగ్గులకు లోనైతి
తెక్కలివలపులకుఁ దెరఁగేది యిఁకను

(॥చెక్కు॥)
మనసిచ్చి నీవు నాతో మాటాలాడఁగా నేను
వొసర నేమని నీకు నుత్తర మిత్తు
చెనకి వేడుకతోడ చెయివట్టి పెనఁగఁగా
యెనసి నీయెదుట నే నిఁక నేమిసేతు

(॥చెక్కు॥)
సొక్కుచు నామోము నీవు సూటిగాఁ జూడఁగాను
తక్కక నేనేమని తలఁచుకొందు
పక్కన నీవు నేఁడు నాపైఁ జేయివేయఁగా
దక్కి నే నేరీతి నీచిత్తమురా మెలఁగుదు

(॥చెక్కు॥)
ముచ్చటతో నీవు నామోవితేనె లానఁగాను
ఇచ్చగించి యేరీతి నింపు వుట్టింతు
ఇచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మెచ్చఁజేసి నీభావ మేమిటఁ బచారింతును

(||pallavi||)
sĕkkusĕmaḍaladoḍa siggulagu lonaidi
tĕkkalivalabulagum̐ dĕram̐gedi yim̐kanu

(||sĕkku||)
manasichchi nīvu nādo māḍālāḍam̐gā nenu
vŏsara nemani nīgu nuttara mittu
sĕnagi veḍugadoḍa sĕyivaṭṭi pĕnam̐gam̐gā
yĕnasi nīyĕduḍa ne nim̐ka nemisedu

(||sĕkku||)
sŏkkusu nāmomu nīvu sūḍigām̐ jūḍam̐gānu
takkaga nenemani talam̐sugŏṁdu
pakkana nīvu nem̐ḍu nābaim̐ jeyiveyam̐gā
dakki ne nerīdi nīsittamurā mĕlam̐gudu

(||sĕkku||)
muchchaḍado nīvu nāmovidenĕ lānam̐gānu
ichchagiṁchi yerīdi niṁpu vuṭṭiṁtu
ichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
mĕchcham̐jesi nībhāva memiḍam̐ basāriṁtunu