చెక్కునొక్కి మన్నించు చేతులెత్తి మొక్కేము
(॥పల్లవి॥)
చెక్కునొక్కి మన్నించు చేతులెత్తి మొక్కేము
దిక్కుల కెక్కించి యిఁక దిగవిడువకుమీ
(॥చెక్కు॥)
వనితలు నీకు బాఁతా వద్దనుండి సేవసేసి
మనసు పట్టేము గాక మా కొరకు
నిను మెప్పించే వారమా నీవారమన్నవారి
యెనసి మన్నించేదే యెక్కుడు నీ బిరుదు
(॥చెక్కు॥)
నీ కెంద రిష్టులు లేరు నీ పొందు సేసి నిన్ను
మైకొని దక్కఁగొనేము మా కొరకు
నీకు నీడు వత్తుమా నీ సలిగె పట్టువారి
యీకడ మన్నించేది యెక్కు డిది సుమ్మీ
(॥చెక్క॥)
నిచ్చపెండ్లి యెంత లేదు నీకు నేము సేసవెట్టి
మచ్చిక చల్లేము గాక మా కొరకు
చెచ్చెరఁ గూడితి నన్ను శ్రీ వేంకటేశ నీవారి
హెచ్చించి మన్నించుటే యెక్కుడైన కీరితి
(||pallavi||)
sĕkkunŏkki manniṁchu sedulĕtti mŏkkemu
dikkula kĕkkiṁchi yim̐ka digaviḍuvagumī
(||sĕkku||)
vanidalu nīgu bām̐tā vaddanuṁḍi sevasesi
manasu paṭṭemu gāga mā kŏragu
ninu mĕppiṁche vāramā nīvāramannavāri
yĕnasi manniṁchede yĕkkuḍu nī birudu
(||sĕkku||)
nī kĕṁda riṣhṭulu leru nī pŏṁdu sesi ninnu
maigŏni dakkam̐gŏnemu mā kŏragu
nīgu nīḍu vattumā nī saligĕ paṭṭuvāri
yīgaḍa manniṁchedi yĕkku ḍidi summī
(||sĕkka||)
nichchabĕṁḍli yĕṁta ledu nīgu nemu sesavĕṭṭi
machchiga sallemu gāga mā kŏragu
sĕchchĕram̐ gūḍidi nannu śhrī veṁkaḍeśha nīvāri
hĕchchiṁchi manniṁchuḍe yĕkkuḍaina kīridi