చెక్కునొక్కి ఇచ్చకము సేతురుగాక
(॥పల్లవి॥)
చెక్కునొక్కి ఇచ్చకము సేతురుగాక
వెక్కసపుఁ సేతలను వింత సేతురా
(॥॥)
వలచిన రమణుండు వాడికెకు నీమీద
కలువల వేసితేను కాతాళింతురా
తలుపుదెరచి నీదండ గూచుండినవాని
చలపట్టి బొమ్మలను జంకింతురా
(॥॥)
పొందైనమగవాడు బుజముపైఁ జెయివేసి
కందువ లంటితేనే కాదందురా
విందులవోవి చూపి విడెమడిగేటివాని
మందెమేళములాడుచు మారుకొందురా
(॥॥)
శ్రీవేంకటేశుఁడు చేరి నిన్ను గాఁగిలించి
ఆవటించి కూడితేనే అలయుదురా
దేవులవంటా నిన్నుఁ దెగడి నవ్వించేవాని
కావరపుఁజూపు చూచి కాతరింతురా
(||pallavi||)
sĕkkunŏkki ichchagamu sedurugāga
vĕkkasabum̐ sedalanu viṁta sedurā
(||||)
valasina ramaṇuṁḍu vāḍigĕgu nīmīda
kaluvala vesidenu kādāḽiṁturā
talubudĕrasi nīdaṁḍa gūsuṁḍinavāni
salabaṭṭi bŏmmalanu jaṁkiṁturā
(||||)
pŏṁdainamagavāḍu bujamubaim̐ jĕyivesi
kaṁduva laṁṭidene kādaṁdurā
viṁdulavovi sūbi viḍĕmaḍigeḍivāni
maṁdĕmeḽamulāḍusu mārugŏṁdurā
(||||)
śhrīveṁkaḍeśhum̐ḍu seri ninnu gām̐giliṁchi
āvaḍiṁchi kūḍidene alayudurā
devulavaṁṭā ninnum̐ dĕgaḍi navviṁchevāni
kāvarabum̐jūbu sūsi kādariṁturā