చెక్కునొక్కేనా బుద్ది చెప్పుటగాక
(॥పల్లవి॥)
చెక్కునొక్కేనా బుద్ది చెప్పుటగాక
గక్కన నిందులకుఁగా కళవళ మేఁటికే
(॥చెక్కు॥)
తనుఁదానె రాకుండితే తలఁపులో రాఁడా
మనసునా రాకుండితే మాటలో రాఁడా
తను నిందరిలో దొలతనమే చెరుచనేలే
వెనకఁ జెప్పేఁగాని వేగిరించనేఁటికే
(॥చెక్కు॥)
పాడి దా నొల్లకుండితే పంతమైన నొల్లఁడా
వాడికా నొల్లకుండితే వంతులకు నొల్లఁడా
యీడనె ఇంతిటిలోన యెమ్మెలు చెరుచనేలే
ఆడఁ దనరచ్చలలో నైనదయ్యీఁగాని
(॥చెక్కు॥)
సెలవి నవ్వకుండితే చెక్కు చెమరించఁడా
చెలగి వూరకుండితే చేతికి లోఁగాఁడా
బలిమి శ్రీవేంకటాధిపతి నన్నుఁ గూడె ఇట్టె
పలువినయాలు సేసీఁ బచ్చిసేయనేఁటికే
(||pallavi||)
sĕkkunŏkkenā buddi sĕppuḍagāga
gakkana niṁdulagum̐gā kaḽavaḽa mem̐ṭige
(||sĕkku||)
tanum̐dānĕ rāguṁḍide talam̐pulo rām̐ḍā
manasunā rāguṁḍide māḍalo rām̐ḍā
tanu niṁdarilo dŏladaname sĕrusanele
vĕnagam̐ jĕppem̐gāni vegiriṁchanem̐ṭige
(||sĕkku||)
pāḍi dā nŏllaguṁḍide paṁtamaina nŏllam̐ḍā
vāḍigā nŏllaguṁḍide vaṁtulagu nŏllam̐ḍā
yīḍanĕ iṁtiḍilona yĕmmĕlu sĕrusanele
āḍam̐ danarachchalalo nainadayyīm̐gāni
(||sĕkku||)
sĕlavi navvaguṁḍide sĕkku sĕmariṁcham̐ḍā
sĕlagi vūraguṁḍide sedigi lom̐gām̐ḍā
balimi śhrīveṁkaḍādhibadi nannum̐ gūḍĕ iṭṭĕ
paluvinayālu sesīm̐ bachchiseyanem̐ṭige