Sekku sedi toda simtimchede kaaga

చెక్కు చేతి తోడ చింతించేదే కాక
Language

(॥పల్లవి॥)
చెక్కు చేతి తోడ చింతించేదే కాక
అక్కలాల మిమ్ము నిఁక ననఁగఁ జోటేది

(॥చెక్కు॥)
చెంతనున్నచెలులే చెలువునికి లోనైతే
మంతన మెవ్వరితోడ మాటలాడేది
కాంతునిమాటలవొరగలు మీరే దిట్టితేను
యెంతటివారికినైనా యెట్టు దరించేది

(॥చెక్కు॥)
పిలిచితెచ్చేటివారే ప్రియునిఁ గలసితే
చలములెవ్వరితోడ సాదించేది
బలిమి నాతనికిఁగా బాసకు మీరే వచ్చితే
యిలమీఁద చుట్టరికా లెట్టుసేసేది

(॥చెక్కు॥)
కాఁగిలించఁబెట్టేవారే కందువలు సోఁకించితే
చేఁగదేర నెవ్వరిపై సేసవెట్టేది
ఆఁగి శ్రీవేంకటేశుమో నప్పుడే నాకిప్పించితే
పాఁగిన మీనేర్పు లెట్టు భావించేది

(||pallavi||)
sĕkku sedi toḍa siṁtiṁchede kāga
akkalāla mimmu nim̐ka nanam̐gam̐ joḍedi

(||sĕkku||)
sĕṁtanunnasĕlule sĕluvunigi lonaide
maṁtana mĕvvaridoḍa māḍalāḍedi
kāṁtunimāḍalavŏragalu mīre diṭṭidenu
yĕṁtaḍivāriginainā yĕṭṭu dariṁchedi

(||sĕkku||)
pilisidĕchcheḍivāre priyunim̐ galaside
salamulĕvvaridoḍa sādiṁchedi
balimi nādanigim̐gā bāsagu mīre vachchide
yilamīm̐da suṭṭarigā lĕṭṭusesedi

(||sĕkku||)
kām̐giliṁcham̐bĕṭṭevāre kaṁduvalu som̐kiṁchide
sem̐gadera nĕvvaribai sesavĕṭṭedi
ām̐gi śhrīveṁkaḍeśhumo nappuḍe nāgippiṁchide
pām̐gina mīnerbu lĕṭṭu bhāviṁchedi