చెక్కిటిచేయి దియ్యదు చింతతోడను
(॥పల్లవి॥)
చెక్కిటిచేయి దియ్యదు చింతతోడను
చక్కఁబెట్టుదువు ప(స?)తి సరుగన రావయ్యా
(॥చెక్కి॥)
కొమ్మ నీతో నెఱఁగక కోపగించుకొంటినంటా
వుమ్మడిఁ బొడిఁబడుచు నుసురనీని
యిమ్ముల నెంతసేసిన యీపె నీకు మేలుది
సమ్మతించఁ జెప్పుదువు సరుగన రామయ్యా
(॥చెక్కి॥)
మగువ నిన్నపుడు బొమ్మల జంకించితినంటా
చిగురుఁబరితాపానఁ జింతీంచీని
తగవులు దప్పినాను తరుణి పాయఁగలేదు
జగడము దీరుతువుసరగన రావయ్యా
(॥చెక్కి॥)
సతి నీపై తమకాన చన్నుల నొత్తితినంటా
మతిలో చిడుముడినీరతి సేసీని
యితవై శ్రీవేంకటేశ యేలితివి నీవెందున్నా
సతమైతి విట్లానే సరగన రావయ్యా
(||pallavi||)
sĕkkiḍiseyi diyyadu siṁtadoḍanu
sakkam̐bĕṭṭuduvu pa(sa?)ti sarugana rāvayyā
(||sĕkki||)
kŏmma nīdo nĕṟam̐gaga kobagiṁchugŏṁṭinaṁṭā
vummaḍim̐ bŏḍim̐baḍusu nusuranīni
yimmula nĕṁtasesina yībĕ nīgu meludi
sammadiṁcham̐ jĕppuduvu sarugana rāmayyā
(||sĕkki||)
maguva ninnabuḍu bŏmmala jaṁkiṁchidinaṁṭā
sigurum̐baridābānam̐ jiṁtīṁchīni
tagavulu dappinānu taruṇi pāyam̐galedu
jagaḍamu dīruduvusaragana rāvayyā
(||sĕkki||)
sadi nībai tamagāna sannula nŏttidinaṁṭā
madilo siḍumuḍinīradi sesīni
yidavai śhrīveṁkaḍeśha yelidivi nīvĕṁdunnā
sadamaidi viṭlāne saragana rāvayyā