చెక్కిటిచే యిదియేల చింతయేల
(॥పల్లవి॥)
చెక్కిటిచే యిదియేల చింతయేల
చక్కనయ్యీ నిన్నియును చాలుఁజాలు నుండరా
(॥చెక్కి॥)
మేరతో నాయాసలకు మితిలేదు తతిలేదు
వోరి నీమాటల కెందు నూరటలేదు
దూరలేను నే నిన్ను తొరలింపువినయాలు
సారె నీవుఁ జేయలేవు చాలుఁజాలు నుండరా
(॥చెక్కి॥)
దోమటినాచూపులకుఁ దుదమొదలును లేదు
గామిడినీచేఁతలకు గడ లేదు
వేమారు నిన్ను నిక వేసరించలేను నాతో
సాముసేయలేవు నీవు చాలుజాలు నుండరా
(॥చెక్కి॥)
మమత నాకాఁగిటికి మట్టులేదు గుట్టులేదు
తమకపునీమతికిఁ దనివి లేదు
చెమరించె మేనెల్లా శ్రీవేంకటేశ యిది
సమరతులాయ నింక చాలుఁజాలు నుండరా
(||pallavi||)
sĕkkiḍise yidiyela siṁtayela
sakkanayyī ninniyunu sālum̐jālu nuṁḍarā
(||sĕkki||)
merado nāyāsalagu midiledu tadiledu
vori nīmāḍala kĕṁdu nūraḍaledu
dūralenu ne ninnu tŏraliṁpuvinayālu
sārĕ nīvum̐ jeyalevu sālum̐jālu nuṁḍarā
(||sĕkki||)
domaḍināsūbulagum̐ dudamŏdalunu ledu
gāmiḍinīsem̐talagu gaḍa ledu
vemāru ninnu niga vesariṁchalenu nādo
sāmuseyalevu nīvu sālujālu nuṁḍarā
(||sĕkki||)
mamada nāgām̐giḍigi maṭṭuledu guṭṭuledu
tamagabunīmadigim̐ danivi ledu
sĕmariṁchĕ menĕllā śhrīveṁkaḍeśha yidi
samaradulāya niṁka sālum̐jālu nuṁḍarā