చెక్కిటఁ బెట్టెను చేయి చిత్తములో నదే నుయ్యి
(॥పల్లవి॥)
చెక్కిటఁ బెట్టెను చేయి చిత్తములో నదే నుయ్యి
యెక్కడికిఁ బోరాదు యిఁక నీ చిత్తము
(॥చెక్కిట॥)
జవ్వనపు పైతరపు సతితురుము బరవు
యెవ్వరు విలిచిన నెర వెరపు
యివ్వల నీ విదె చూడు మిదివో నెమ్మోవివాడు
రవ్వ లాయ నీ వలపు రావయ్య యిఁకను
(॥చెక్కిట॥)
చిగురుఁబులకపైరు చిత్తడిచెమటనీరు
పగటుగుబ్బలమీఁద పయ్యద జారు
నగకు మాతో నింత నాతికి నంతా వింత
వెగటాయ నీమాయ విడవయ్య చలము
(॥చెక్కిట॥)
కాయములోని యలపు కనుఁగొనల సొలపు
చాయల సన్నలలోని సారె బులుపు
యీయెడ శ్రీవెంకటేశ యింతిన నీవు గూడఁగా
తోయ రాదు నీ చనవు తోడఁ దోడ నిదివో
(||pallavi||)
sĕkkiḍam̐ bĕṭṭĕnu seyi sittamulo nade nuyyi
yĕkkaḍigim̐ borādu yim̐ka nī sittamu
(||sĕkkiḍa||)
javvanabu paidarabu sadidurumu baravu
yĕvvaru vilisina nĕra vĕrabu
yivvala nī vidĕ sūḍu midivo nĕmmovivāḍu
ravva lāya nī valabu rāvayya yim̐kanu
(||sĕkkiḍa||)
sigurum̐bulagabairu sittaḍisĕmaḍanīru
pagaḍugubbalamīm̐da payyada jāru
nagagu mādo niṁta nādigi naṁtā viṁta
vĕgaḍāya nīmāya viḍavayya salamu
(||sĕkkiḍa||)
kāyamuloni yalabu kanum̐gŏnala sŏlabu
sāyala sannalaloni sārĕ bulubu
yīyĕḍa śhrīvĕṁkaḍeśha yiṁtina nīvu gūḍam̐gā
toya rādu nī sanavu toḍam̐ doḍa nidivo