చేకొని యాపెచనవు చెల్లించరాదా
(॥పల్లవి॥)
చేకొని యాపెచనవు చెల్లించరాదా
దాకొని నీమేలులోనిదాననే నేను
(॥చేకొ॥)
చిప్పిలుఁ జెమటతోడ సిగ్గుతోడ జవరాలు
కొప్పు గొ0తు జారఁగానే కోసరి నిన్ను
చెప్పరాక సన్నలేల సేసే వాపెకు నీవు
యెప్పుడు మీపొ0దులు నే యెఱఁగనివా
(॥చేకొ॥)
చెక్కిటిచేతితోడ సెలవినవ్వులతోడ
చొక్కపుముద్దుమాటల సొలసీ నిన్ను
పక్కన నెఱఁగకుండాఁ బరాకులేల సేసేవు
దిక్కులమీసుద్దులు నేఁ దెలియనివా
(॥చేకొ॥)
తెల్లనికన్నులతోడఁ దేలింపుఁ జూపుల తోడ
చెల్లుబడితనమునఁ జెనకీ నిన్ను
యిల్లిదె శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
వెల్లవిరి నేలితి మీవిధాలు విననినా
(||pallavi||)
segŏni yābĕsanavu sĕlliṁcharādā
dāgŏni nīmelulonidānane nenu
(||segŏ||)
sippilum̐ jĕmaḍadoḍa siggudoḍa javarālu
kŏppu gŏ0tu jāram̐gāne kosari ninnu
sĕpparāga sannalela sese vābĕgu nīvu
yĕppuḍu mībŏ0dulu ne yĕṟam̐ganivā
(||segŏ||)
sĕkkiḍisedidoḍa sĕlavinavvuladoḍa
sŏkkabumuddumāḍala sŏlasī ninnu
pakkana nĕṟam̐gaguṁḍām̐ barāgulela sesevu
dikkulamīsuddulu nem̐ dĕliyanivā
(||segŏ||)
tĕllanigannuladoḍam̐ deliṁpum̐ jūbula toḍa
sĕllubaḍidanamunam̐ jĕnagī ninnu
yillidĕ śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
vĕllaviri nelidi mīvidhālu vinaninā